
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాముఖ్యత ఉందో.. చంద్రగ్రహణం... సూర్య గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సెప్టెంబర్ 7 వతేది ఆదివారం రాత్రి సమయంలో ... రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడనుంది. ఇదే రాశిలో వందేళ్ల క్రితం క్రితం చంద్రగ్రహణం ఏర్పడిందని పండితులు చెబుతున్నారు.
సెప్టెంబర్ 7 ఆదివారం న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ రోజున రాత్రి 9:58కి మొదలై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. శతభిషం , పూర్వాభాద్ర నక్షత్రాలలో... కుంభ రాశిలో కుంభ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము ఏర్పడనుంది.
సూర్యుడు..చంద్రుడు ఈ రెండు గ్రహాల మధ్యకు భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది, ఇలా రాత్రి సమయంలో పౌర్ణమి రోజు వస్తే.. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడిని భూమి నీడ కప్పేస్తుంది. పంచాంగం ప్రకారం.. ఆరోజు ఉన్న నక్షత్రం ఆధారంగా.. గ్రహాల ఆధారంగా ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతారు. రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గతంలో వందేళ్ల క్రితం ఏర్పడిందని.. మరల తిరిగి ఇప్పుడు ( సెప్టెంబర్ 7) సంభవించనుందని చెబుతున్నారు.
ఆ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా మారడం వలన బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. కాంతి వక్రీభవనం చెందిన తర్వాత... తక్కువ వేవ్‌లెన్త్ ఉండే ఇతర రంగులు చెల్లాచెదురవుతాయి. సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ సమయంలో భూమి సైజు చంద్రుడికంటే 4 రెట్లు అధికంగా ఉంటుంది.
చంద్రగ్రహణ చంద్రుడు ఎరుపు, రాగి రంగులలో మెరిసిపోతూ ఆకాశంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు. ఈ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లో స్పష్టంగా దర్శనమిస్తుంది. భారత్‌లో కూడా ఈ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు, మేఘావరణం లేదా కాలుష్యం దర్శనాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.