టైటానిక్ షిప్‌లో డైమండ్ నెక్లెస్.. అచ్చం సినిమాలో ఉన్నట్లే ఉంది!

టైటానిక్ షిప్‌లో డైమండ్ నెక్లెస్.. అచ్చం సినిమాలో ఉన్నట్లే ఉంది!

టైటానిక్ షిప్ గురించి, దాని ప్రమాదం గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ ప్రమాదంజరిగి వంద ఏళ్లు దాటినా ఆ అద్భుతమైన టైటానిక్ నౌకను, ఆ ప్రమాదాన్నీ.. ఎప్పటికీ మరచిపోలేం. ఏప్రిల్ 14, 1912న ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొన్న ఐకానిక్ షిప్.. సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 1517 మంది ప్రజలు మృత్యువాత పడగా, విలువైన వజ్ర వైడుర్యాలు, సంపద సముద్ర గర్భంలో చేరిపోయాయి. తాజాగా, టైటానిక్ శిథిలాలలో విలువైన డైమండ్ నెక్లెస్ ను కనుగొన్నారు.

గ్వెర్న్సీకి చెందిన మాగెల్లాన్ సంస్థ రెండు సబ్మెరైన్లను ఉపయోగించి సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఫోటోలు తీస్తోంది. టైటానిక్ అవశేషాలను ఫోటోలుగా తీసి వాటిని కదిలే చిత్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తోంది. అలా సదరు కంపనీ తీసిన కొన్ని ఫోటోలలో ఓ డైమండ్ నెక్లెస్ వెలుగులోకి వచ్చింది. యుకే - అమెరికా మధ్య ఉన్న ఒప్పందం కారణంగా ఆ నెక్లెస్ ని శిథిలాల నుంచి బయటకు తీయలేదు. ప్రస్తుతం మాగెల్లాన్ కంపనీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ద్వారా ఆ నెక్లెస్ ఏవరిదో గుర్తించే పనిలో ఉంది. టైటానిక్ షిప్ లో ప్రయాణించిన 2200 మందినీ ఫేషియల్ టెక్నాలజీ ద్వారా విశ్లేషించి నెక్లెస్ అసలు యజమాని ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.

https://www.instagram.com/reel/Csb5M83guc-/?utm_source=ig_web_copy_link