2027 ఎన్నికలకు ప్రీఫైనల్, సెమీఫైనల్ అంటూ సాగిన బీహార్ ఎన్నికల కోలాహలం ముగిసింది. 2025 నవంబర్ 14వ తేదీన బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలవటంతో.. ఈ ఏడాది ఎన్నికల సందడి ముగిసింది. బీహార్ లో విజయ సంబరాలు జరుగుతున్న సమయంలోనే.. ఇదే ఊపులో రాబోయే ఎన్నికలకు బీజేపీ రెడీ అయిపోతుంది. 2025లో బీహార్ ఇచ్చిన కిక్ తో.. 2026లో స్టార్టింగ్ లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు హుషారులో రెడీ అవుతుంది.
2026లో జరిగే రాష్ట్రాల ఎన్నికలు ఇవే :
1. అసోం రాష్ట్రం : అసెంబ్లీ సీట్లు : 126
2. కేరళ రాష్ట్రం : అసెంబ్లీ సీట్లు : 140
3. తమిళనాడు రాష్ట్రం : అసెంబ్లీ సీట్లు : 234
4. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం : అసెంబ్లీ సీట్లు : 294
5. పాండిచ్చేరి కేంద్ర పాలిత రాష్ట్రం : అసెంబ్లీ సీట్లు : 30
అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం 2026, ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక పాండిచ్చేరిలో మే, జూన్ నెలలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలి.
ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. SIR.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహిస్తోంది. అంటే ఆ రాష్ట్రాల్లో ఓట్లను రివిజన్ చేయనుంది. వినియోగంలో లేని ఓటర్ల తొలగింపు.. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను చేపడుతోంది ఎన్నికల సంఘం.
2026 ఎన్నికలు మే-జూన్ వరకు ముగిసిన వెంటనే మళ్లీ 2027 జనరల్ ఎలక్షన్స్ మొదలుకానున్నాయి. అంటే బీహార్ ఎన్నికలతో మొదలైన ఎలక్షన్ల సందడి 2027 వరకు కొనసాగనుంది.
2027 లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు:
2027 లో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు, అసెంబ్లీ స్థానాలు సంఖ్య:
1.గోవా రాష్ట్రం: 40
2.మణిపూర్ రాష్ట్రం: 60
3.పంజాబ్ రాష్ట్రం: 117
4.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం: 403 సీట్లు
5.గుజరాత్ రాష్ట్రం: 182
6.హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం: 68
