డెలివరీ అయ్యాక వ్యాక్సిన్​ తీసుకోవచ్చు

డెలివరీ అయ్యాక వ్యాక్సిన్​ తీసుకోవచ్చు


ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు హైరిస్క్​ కేటగిరిలో ఉంటారు. వాళ్లకే వ్యాక్సిన్ ఎక్కువ అవసరం. కానీ మన దేశంలో కొవిడ్​ వ్యాక్సిన్​పై పూర్తి స్థాయిలో ట్రయల్స్​ జరగలేదు. కాబట్టి వాళ్లకు మినహాయింపు ఇచ్చారు. యూకే, కొన్ని దేశాల్లో గర్బిణీలకు కూడా వ్యాక్సిన్​ ఇస్తున్నారు. ఆ దేశాల్లో జరిగిన స్టడీస్​లో సేఫ్టీ ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. కానీ, మన దేశంలో ఇవ్వట్లేదు.  గర్భవతులపై ట్రయల్స్​ చేసి, స్టడీ చేసిన తర్వాత అనుమతించే సరికి లేట్​ అవుతుంది. కాబట్టి కేర్​ఫుల్​గా ఉండాల్సిందే. ఈ టైమ్​లో ప్రెగ్నెన్సీని ఆపడం మంచిది అనుకుంటే ఓసీ (ఓరల్​ కాంట్రసెప్టివ్​) పిల్స్ వాడొచ్చు. కానీ వ్యాక్సిన్​ తీసుకునే టైమ్​లో మాత్రం ఓసీ పిల్స్​ వాడకూడదు. ప్రెగ్నెన్సీని ఆపడానికి దంపతులు ఆల్టర్నేటివ్​ పద్ధతుల్ని పాటించాలి. 

మెన్​స్ట్రువల్​ ప్రాబ్లమ్స్​

పీరియడ్ టైం​లో ఓవర్​ బ్లీడింగ్​, పీసీఓడీ ప్రాబ్లమ్స్​తో బాధపడేవాళ్లు మెడిసిన్స్​ వాడుతుంటారు. వ్యాక్సిన్​ తీసుకునే టైంలో ఆ మెడిసిన్స్​ తీసుకోవడం ఆపాలి. పిల్లల కోసం మెడిసిన్స్​ వాడేవాళ్లు కూడా వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. మెడిసిన్స్​ ఆపాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల మగవాళ్లలో స్పెర్మ్​ కౌంట్​లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని వారాలకు మళ్లీ నార్మల్​ అవుతుంది. 

తల్లిపాలలో యాంటిబాడీస్​ 

డెలివరీ తర్వాత కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవచ్చు. వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత బిడ్డకు పాలివ్వొచ్చు. ఆ పాలలో కూడా యాంటీ బాడీస్​ ఉన్నట్లు గుర్తించారు. ఆ పాలు పడితే బిడ్డలో కూడా కరోనాని ఎదుర్కొనే కెపాసిటీ పెరుగుతుంది. 

    - డా. వజ్రాల కావ్య ప్రియ, 
ఇన్​ఫెర్టిలిటీ స్పెషలిస్ట్