Varun tej, Sekar Kammula: ఫిదా కాంబోలో మరో మూవీ.. ఈసారి డిఫరెంట్ జానర్

Varun tej, Sekar Kammula: ఫిదా కాంబోలో మరో మూవీ.. ఈసారి డిఫరెంట్ జానర్

ఫిదా.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పల్లెటూరి బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఫిదా చేసింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. విడుదలకు ముందే మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తరువాత అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2017లో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టీమ్ అందరికి మంచి బ్రేక్ అందించింది. 

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఫిదా సినిమా కాంబో మళ్ళీ రిపీట్ కానుందట. అవును. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల మరో సినిమా కోసం జతకట్టనున్నారట. అవును.. ఇటీవలే శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ కి ఒక కథను వినిపించాడట. కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట వరుణ్ తేజ్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ హీరో ధనుష్ తో కుబేర సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే వరుణ్ తేజ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడట శేఖర్ కమ్ముల. 

ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే.. ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం దర్శకుడు కరుణ కుమార్ తో మట్కా సినిమా చేస్తున్నాడు వరుణ్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అతి త్వరలో ఈ సినిమా కూడా థియేటర్స్ లోకి రానుంది.