
వికారాబాద్ వెలుగు: అత్త చనిపోవడంతోఆమెకు శ్రద్ధాంజలి ఫ్లెక్సీ చేయించి తీసుకెళ్తున్న క్రమంలో అల్లుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెం దాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ మండలం లోని పుల్ మద్ది గ్రామంలో జరిగింది. గ్రామస్తులు. పోలీసులు తెలిపిన ప్రకారం పుల్ మద్ది గ్రామాని కి చెందిన నల్ల శ్రీనివాస్(35) హైద్రాబాద్లోని లింగంపల్లి ఆర్పీఎఫ్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన అదే గ్రామానికి చెందిన జోగు లక్ష్మమ్మ కూతురు మాధవిని పెండ్లి చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. శ్రీనివాస్ అత్త లక్ష్మమ్మ అనారోగ్యంతో బుధవారం ఉదయం మృతిచెందింది. ఆమె ఫ్లెక్సీ వేయించ దానికి శ్రీనివాస్ వికారాబాద్ పట్టణానికి వెళ్లాడు. ప్లెక్సీ తయారుచేయించి తిరిగి పుల్ మద్ది గ్రామా నికి బైక్పై వెళ్తున్నాడు. కొత్తగడి ప్రాంతంలోరోడ్డు గుంతలమయంగా ఉండడంతో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. అదే సమయంలో పక్క నుంచివేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం శ్రీనివాస్ తల పైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ స్పాట్లో చనిపోయాడు.
ఘటనా స్థలంలో అత్త శ్రద్ధాంజలి బ్యానర్ ను అల్లుడి మృతదేహంపై కప్పడం అక్కడున్న వారి హృదయాలను కదిలిం చింది. ఒకే రోజు అత్త, అల్లుడు మృతితో పులమద్ది గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.