చంద్రగ్రహణం తరువాత పాటించాల్సిన నియమాలు ఇవే..!

చంద్రగ్రహణం  తరువాత పాటించాల్సిన నియమాలు ఇవే..!

 చంద్రగ్రహణం రాత్రి సమయంలో  ఏర్పడుతుంది.   ఆ సమయంలో అందరూ నిద్రపోతుంటారు.  ఆచారాలు.. మంత్ర బలం ఉన్న వారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణం వీడిన తరువాత స్నానం చేసి శుద్దవుతారు.  గ్రహణం రాత్రి ఏర్పడింది కాబట్టి ఉదయం లేచిన తరువాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. . .

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు.  ఈ సమయంలో చాలామంది బయటకు కూడా రారు.  ఇంట్లోనే ఉంటారు. మంత్రబలం ఉన్న వారు.. అనుష్టానం చేసుకుంటారు.  ఈ సమయంలో చేసే అనుష్టానికి మిగిలిన రోజుల్లో చేసిన దాని కంటే వేలరెట్లు అధికంగా ఫలితం ఉంటుందని చెబుతుంటారు. ఉదాహరణకు మనము ఇమ్యూనిటి పవర్​ పెంచుకొనేందుకు పండ్లు తీసుకుంటాం కదా.. అలానే మంత్రబలం శక్తిని పెంచుకొనేందుకు గ్రహణాల సమయంలో అనుష్టానం ద్వారా వృద్ది చెందుతుంది.  

గ్రహణం సూతకాలం ప్రారంభమైన దగ్గరి నుంచి . .. దేవుడి విగ్రహాలను .. దేవుడి పటాలను ఎట్టి పరిస్థితిలోతాకకూడదు.  అందుకే దేవాలయాలు కూడా మూసేస్తారు. ఈ సమయంలో రాహువు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గ్రహణ సమయంలో రాహువు ద్వారా ఏర్పడే  ప్రతికూల ప్రభావాలు విశ్వమంతటా చాలా బలంగా ఉండి... భూమి పై ఉన్న వస్తువులపై.. జీవరాశులపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సెప్టెంబర్​ 7 వతేది  రాత్రి సమయంలో  చంద్రగ్రహణం ఏర్పడుతుంది.    ఇటువంటి పరిస్థితిలో గ్రహణ సమయంలో నిద్రలేవకపోతే మీరు తెల్లవారుజామున నిద్రలేచినట్లయితే వెంటనే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్​ 8 వ తేది నిద్రలేచిన వెంటనే... ఇంటి  ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెబుతున్నారు. వీటిని అనుసరించడం ద్వారా, ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేయవచ్చు. 

 గ్రహణం తర్వాత ఇలా చేయండి..

 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం ముగిసిన వెంటనే, సూతకం కూడా ముగుస్తుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగాజలాన్ని చల్లాలి. గంగా జలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి.  ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అలాగే, ప్రతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మి ఉండదు అని చెబుతుంటారు.  దీనితో పాటు ఇల్లు, దుకాణాలను శుభ్రంగా కడగాలి. గంగాజలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లడం వల్ల ప్రతికూలత తొలగిపోతుందని, గ్రహణం ప్రభావాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. 

 గ్రహణం తర్వాత స్నానం చేయండి.

 మీరు స్నానం చేయలేకపోతే గంగాజలం మీపై చల్లుకోండి. స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగాజలాన్ని చల్లడం మంచిది.  గ్రహణం తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముందుగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత గంగాజలం చల్లాలి. ఆ తరువాత ఆహార పదార్థాలపై గంగాజలం చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

గ్రహణం కంటె ముందు సమయంలో తయారుచేసిన ఆహారాన్ని పూర్తిగా పారవేయాలి. గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్ధాలను తినడం ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని పండితులు చెబుతారు. చంద్రగ్రహ‌ణం త‌ర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరును మార్చేసి కొత్తగా మ‌ళ్లీ తాగునీరు తెచ్చుకోవాలి.గ్రహ‌ణం ముగిశాక వెంటనే త‌ల‌స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. తరువాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి