ఎత్తేస్తున్నారా..? : అతి పెద్ద ఆఫీస్ బిడ్డింగ్ ఖాళీ చేసిన బైజూస్

ఎత్తేస్తున్నారా..? : అతి పెద్ద ఆఫీస్ బిడ్డింగ్ ఖాళీ చేసిన బైజూస్

భారతీయ ఎడ్-టెక్ సంస్థ, బైజూస్ గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. తాజాగా బెంగళూరులోని అతిపెద్ద కార్యాలయ స్థలాలలో ఒకటైన ఒకదానిని ఖాళీ చేసింది. ఇటీవల ఇన్సెంటివ్‌లు ఆలస్యం కావడంపై బైజూస్ ఉద్యోగి సీనియర్‌లను ఎదిరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ALSO READ:ట్విట్టర్ లోగో మారిపోయింది.. పిట్టపోయి ఎక్స్ (X) వచ్చేసింది

ఖర్చులను ఆదా చేయడానికి ఎడ్-టెక్ సంస్థ బెంగళూరు కళ్యాణి టెక్ పార్క్‌లోని 5.58 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ ను బైజూస్ ఖాళీ చేసింది. ఈ ఆఫీస్‌ను ఖాళీ చేయడం ద్వారా బైజూస్‌కు నెలకు రూ. 3 కోట్ల వరకు ఆదా అవుతుందని సమాచారం. జూలై 23 నుండి ఇళ్ల నుండి పని చేయాలని బైజూస్ ఉద్యోగులను కోరగా.. ప్రెస్టీజ్ టెక్ పార్క్‌లో తొమ్మిది అంతస్తుల్లో ఉన్న రెండింటిని కూడా బైజూస్ వెకేట్ చేయనున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే పలు కార్యాలయాలను ఖాళీ చేసిందని, దీనికి సంబంధించిన వివరాలు ఆగస్టులో తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. తీవ్రమైన ఆర్థిక భారం మధ్య ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కోసమే బైజూస్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. లేఆఫ్ లపై దృష్టి పెట్టిన కంపెనీ.. ఇప్పటికే తొమ్మిది నెలల్లోనే ఐదు వేల మందికి పైగా స్టాఫ్ ను తొలగించింది. ఇదే క్రమంలో ఉద్యోగులకు పీఎఫ్ బకాయిలు చెల్లించట్లేదన్న ఆరోపణలు కూడా వచ్చాయి.