ట్విట్టర్ లోగో మారిపోయింది.. పిట్టపోయి ఎక్స్ (X) వచ్చేసింది

ట్విట్టర్ లోగో మారిపోయింది.. పిట్టపోయి ఎక్స్ (X) వచ్చేసింది

ట్విట్టర్ అనగానే అందరికీ గుర్తుచ్చేది నీలి రంగులో కనిపించే పిట్ట. ఇప్పుడు ఆ పిట్టకు విముక్తి కల్పించారు. దాని స్థానంలో కొత్తగా X అనే లోగోను తీసుకొచ్చారు. కొన్ని నిమిషాల ముందే నుంచే ట్విట్టర్ హోమ్ పేజీలో ఈ కొత్త లోగో కనిపిస్తోంది.

ట్విట్టర్ లోగో మార్పు విషయాన్ని ఎలాన్ మస్క్ 24 గంటల క్రితమే ట్వీట్ల ద్వారా వెల్లడించారు.

pic.twitter.com/IwcbqMnQtA

— Elon Musk (@elonmusk) July 23, 2023

X Corpలో మొదటి అక్షరం

గతేడాది 'ట్విట్టర్'ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్.. దాన్ని 'X Corp'లో విలీనం చేశారు. అందువల్లే.. పిట్ట స్థానంలో 'X' లోగోను పెట్టినట్లు తెలుస్తోంది. అందునా ఎలన్ మస్క్‌ బ్రాండ్లలో 'X' సాధారణమే. ఇప్పటికే 'Space X' పేరుతో ఆయనకు అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది.

Evolution of Twitter Logos :#TwitterX #TwitterLogo #ElonMusk pic.twitter.com/2LGgOqj65F

— Pratham  (@Pratham_Tweetz) July 24, 2023