తల్లి మందలించడంతో కనపడకుండా పోయి శవమై..

తల్లి మందలించడంతో కనపడకుండా పోయి శవమై..

మెదక్ (చిలప్ చెడ్), వెలుగు: తల్లి మందలించడంతో కనబడకుండా పోయిన యువకుడు పది రోజుల తర్వాత శవమై దొరికిన  ఘటన చిలప్​ చెడ్​ మండలంలో జరిగింది. ఏఎస్సై మిస్బావొద్దీన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండ పోతుగల్ గ్రామానికి చెందిన తలారి లచ్చమ్మ చిన్న కొడుకు తలారి సత్యనారాయణ (27) డిగ్రీ పూర్తి చేశాడు.  ఏ పనీ చేయడం లేదు. దీంతో తల్లి అతన్ని పని చేసుకోవాలని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సత్యనారాయణ ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫ్రెండ్స్​, చుట్టాల వద్ద వెతికినా అతని ఆచూకీ లభించలేదు.  గత నెల 30న తల్లి లచ్చమ్మ చిలప్ చెడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాగా మండలంలోని చిట్కుల్ సమీపంలోని మంజీరా నది బ్రిడ్జి వద్ద నీటిలో తేలిన సత్యనారాయణ డెడ్​ బాడీని గుర్తించారు.