మొన్న నోయిడాలో,ఈరోజు బెంగళూర్‌లో.. ఇలాగైతే ఎలా మరి..?

మొన్న నోయిడాలో,ఈరోజు బెంగళూర్‌లో.. ఇలాగైతే ఎలా మరి..?

రాపిడో, ఉబర్, ఓలా లాంటి వాటికి జనాలు చాలా ఫాస్ట్‌గా అలవాటు పడిపోయారు. ఎందుకంటే సొంత వాహనాలు కొనే స్తోమత లేనివారు. అలాగని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లో ప్రయాణించలేని వారు బెస్ట్  ఆప్షన్‌గా ఆన్ లైన్‌లో ఆటోనో, బైక్ లేదా కారో బుక్ చేసుకుంటున్నారు. అప్పటి వరకు వారు వెళ్లవలసిన ప్లేస్‌కు సులభంగా చేరుకుంటున్నారు. దీంతో టైం, డబ్బు రెండూ ఆదానే. కానీ కొన్ని సార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటివి ఈమధ్యకాలంలో ఎక్కవగా వెలుగుచూస్తున్నాయి. నోయిడాలో శుక్రవారం ఓ యువకుడు ఆటోరిక్షా బుక్ చేసుకున్నాడు. రైడ్ పూర్తైన తర్వాత రూ.7.66కోట్లు ఛార్జ్ చూపించింది. దీనిపై ఉబర్ క్యాబ్ స్పందించి అఫిషియల్ ఎక్స్ ఖాతాతో కస్టమర్‌కు క్షమాపణ చెప్పింది. ఈ విషయం జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన రెండు రోజులకే ఈరోజు బెంగళూర్ లో మరో ఘటన చోటుచేసుకుంది. 

ఏప్రిల్ 1న శ్రీరాజ్ నీలేష్ అనే ఓ వ్యక్తి తన భార్యతో కలిసి బెంగళూర్ లోని కేఆర్ పురం నుంచి కోరమంగళ వెళ్లేందుకు ఉబర్‌లో ఓ ఆటోరిక్షా బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకునేటప్పుడు రూ.207 చూపించింది. కానీ.. రైడ్ పూర్తి చేసుకున్నాక బిల్లు చెల్లిద్దామని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా కస్టమర్‌కు దిమ్మదిరిగింది. ఏకంగా రూ.కోటి చూపించింది. ఇది చూసి డ్రైవర్ కూడా షాక్ అయ్యాడు. కస్టమర్ కేర్ సంప్రదించగా.. ఆ టైంలో ఎవరూ స్పందించలేదు. దీంతో వినియోగదారులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద తరహావి కాకున్నా అడపాతడపా చిన్నచిన్న సమస్యలు ఆన్ లైన్ బుకింగ్స్ లో ఎదురైతునే ఉంటాయి. వీటిని పరిష్కరించాలని కస్టమర్స్ సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.