రామగుండంలో..రాజీనామాల పర్వం

రామగుండంలో..రాజీనామాల పర్వం
  •     ఇండిపెండెంట్లుగా పోటీకి రెడీ అవుతున్న అసమ్మతి లీడర్లు
  •     బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన సోమారపు, గోపు, కందుల
  •     స్వతంత్రులు గెలిచిన చరిత్ర రామగుండం సొంతం
  •     గతంలో నలుగురు ఇండిపెండెంట్లు విజయం

గోదావరిఖని, వెలుగు : రామగుండం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల్లోని లీడర్లు టికెట్​ దక్కకపోవడంతో ఆ పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పలువురు ఇండిపెండెంట్లను ఎమ్మెల్యేలుగా గెలిపించిన చరిత్ర  రామగుండం నియోజకవర్గానికి ఉంది. ఈ క్రమంలోనే బీజేపీలోని సోమారపు సత్యనారాయణ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గోపు అయిలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కందుల సంధ్యారాణి ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్ధమయ్యారు.  

నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు.. 

2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగకముందు రామగుండం పారిశ్రామిక ప్రాంతం మేడారం (ఎస్సీ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)గా ఉండేది. 1983లో జరిగిన ఎన్నికల్లో మాతంగి నర్సయ్య మేడారం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి జి.ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 14,608 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి టిక్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వనందుకు పార్టీ నుంచి బయటకు వచ్చి మాలెం మల్లేశం ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 15,319 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరగగా రామగుండం జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది.

ఈ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పోటీ చేసిన సోమారపు సత్యనారాయణ సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కౌశిక హరిపై 2,220 ఓట్లతో గెలిపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీ చేసినా ఇక్కడి ప్రజలు ఆయనను ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థిగానే గుర్తించారు.

ఆ ఎన్నికల్లో చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 26,419 ఓట్ల మెజార్జీతో విజయం సాధించాడు. కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భార్య చనిపోవడం, అప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఇలా నలుగురిని ఇక్కడి ప్రజలు ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేగా గెలిపించారు.

ప్రజల సానుభూతితోనే బరిలోకి....

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమకు ప్రజల ఆదరణ ఉంటుందనే ఆశతో ప్రధాన పార్టీల్లో టికెట్​ఆశించి భంగపడిన లీడర్లు ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచేందుకు రెడీ అయ్యారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గోపు అయిలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రులుగా రామగుండం నుంచి బరిలో ఉండనున్నట్టు ప్రకటించారు.

నియోజకవర్గంలోని యాదవ ఓట్లపై గోపు అయిలయ్య యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహిళ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కందుల సంధ్యారాణి ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తన సొంత ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలవాలని భావిస్తున్నారు.