
కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతోంది. ఈ సందర్భంలో భారత ప్రధాని మోడీ స్పందించినందుకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ దేశంలో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఏర్పడిన వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితులు, ప్రజల కష్టాలపై మోడీ ఇటీవల ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లో వరదలు సృష్టించిన విలయం చూసి చాలా బాధపడ్డానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మోడీ, బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వీలైనంత వేగంగా పాక్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీప్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందించారు. ఇటీవల పాక్ లో ఏర్పడ్డ ఆస్తి, ప్రాణ నష్టాలపై స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రకృతి విలయం నుంచి ప్రజలు కోలుకుంటారన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా11 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వీరి కోసం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
I thank ?? PM Narendra Modi @narendramodi for condolences over the human & material losses caused by floods. With their characteristic resilience the people of ?? shall, InshaAllah, overcome the adverse effects of this natural calamity & rebuild their lives and communities.
— Shehbaz Sharif (@CMShehbaz) August 31, 2022