‘రంగరంగ వైభవంగా’ సినిమాతో వచ్చిన వైష్ణవ్ తేజ్

‘రంగరంగ వైభవంగా’ సినిమాతో వచ్చిన వైష్ణవ్ తేజ్

ఉప్పెన,  కొండపొలం చిత్రాల తర్వాత ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో వస్తున్నాడు వైష్ణవ్ తేజ్. గిరీశాయ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఇవాళ విడుదలవుతున్న సందర్భంగా వైష్ణవ్ ఇలా ముచ్చటించాడు. 

‘‘ఇదో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. మెడికల్ స్టూడెంట్‌‌‌‌గా కనిపిస్తాను. బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. మొదటి రెండు సినిమాలతో పోల్చితే స్టైలిష్‌‌‌‌గా ఉంటాను. ఇగోల మధ్య నడిచే జెన్యూన్ లవ్‌‌‌‌స్టోరీ. ఇలాంటి కథలు ఇప్పటికే వచ్చినా ఇది చాలా ఫ్రెష్‌‌‌‌ ఫీల్‌‌‌‌నిస్తుంది. ఫ్యామిలీ డ్రామాతో పాటు లవ్, ఎమోషన్, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ అన్నీ ఉంటాయి. సినిమా మొత్తం సరదాగా సాగిపోతుంది.

నరేష్, ప్రభు, ప్రగతి, తులసి లాంటి సీనియర్స్‌‌‌‌తో నటించడం హ్యాపీ. నవీన్ చంద్ర ఇంటెన్స్‌‌‌‌ యాక్టింగ్‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తాడు. వీళ్లందరి నుంచి చాలా నేర్చుకున్నాను. ప్రతి సినిమాకీ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలనే అనుకుంటాను. కేతికతో వర్క్ చేయడం లవ్‌‌‌‌లీ ఎక్స్‌‌‌‌పీరియెన్స్. ఆఫ్‌‌‌‌ స్ర్కీన్‌‌‌‌లో మేము జోవియల్‌‌‌‌గా ఉండటం ఆన్‌‌‌‌ స్క్రీన్‌‌‌‌కి బాగా హెల్పయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్ చూశాక కొన్ని సీన్స్‌‌‌‌లో పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేశానంటున్నారు. అదేమీ కావాలని చేయలేదు. క్యాజువల్‌‌‌‌గా జరిగింది.

‘ఖుషి’ ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ సినిమాని మ్యాచ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. ఆయన బర్త్‌‌‌‌డేకి రిలీజ్ కావడం కూడా యాదృచ్ఛికమే. నాలుగైదు డేట్స్ మార్చి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఆయన సినిమాలు వందలసార్లు చూసేవాడిని. ఆయన సినిమాలు రీమేక్ చేయాల్సి వస్తే ‘బద్రి’ని సెలెక్ట్ చేసుకుంటాను. నా సినిమాల సెలెక్షన్ నాదే. ఎవరూ ఇన్‌‌‌‌వాల్వ్ అవ్వరు.

నాకు కథ నచ్చితేనే చేస్తాను. ఓసారి నచ్చి చేశాక సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పట్టించుకోను. సోషల్‌‌‌‌ మీడియాలో కూడా  యాక్టివ్‌‌‌‌గా ఉండను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీనే నాకు ఫీడ్ బ్యాక్ ఇస్తారు. ఇక నెక్స్ట్ మూవీ శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌‌‌‌‌‌‌‌తో చేయబోతున్నాను. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.’’