నిర్మాతగా ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్​పీరియన్స్​ : అనిల్ సుంకర

నిర్మాతగా ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్​పీరియన్స్​ :  అనిల్ సుంకర

అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘ఏజెంట్’. ఈనెల 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ‘‘ఏజెంట్’ అనేది భారీ స్పాన్ వున్న సినిమా.  ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. ఎమోషన్స్ కూడా బలంగా వుంటాయి. విజువల్స్ చాలా గ్రాండ్‌‌‌‌గా వుంటాయి. గొప్ప థియేటర్ ఎక్స్​పీరియన్స్​ను ఇచ్చే చిత్రం. అఖిల్‌‌‌‌కి..  బిఫోర్ ఏజెంట్, ఆఫ్టర్ ఏజెంట్‌‌‌‌లా వుంటుంది.

ఈ చిత్రం తర్వాత అఖిల్ స్పాన్ మరో స్థాయిలో వుంటుంది. నిర్మాతగా నాకు  ఈ మూవీ డిఫరెంట్ ఎక్స్​పీరియన్స్​ను ఇచ్చింది. ఒక డేట్‌‌‌‌ని లాక్ చేసి ఎలాగైనా ఆ డేట్‌‌‌‌కి రావాలని ఫిక్స్ అయ్యాం. అందుకోసం గత నెల రోజులుగా డే అండ్ నైట్ కష్టపడ్డాం. చాలా పెద్ద సినిమా. గంటన్నర సీజీ వర్క్. ప్రతి ఫ్రేమ్‌‌‌‌లో సీజీ వుంటుంది. అందుకే కొంత ఒత్తిడిగా ఫీలయ్యాం. పాన్ ఇండియా రిలీజ్‌‌‌‌కు కనీసం మూడు నెలలు టైమ్ కావాలి. అందుకే ముందుగా తెలుగులో విడుదల చేసి, ఆ తర్వాత అటు వైపు ప్లాన్ చేస్తున్నాం. స్పై సినిమాలు అన్నాక హాలీవుడ్ చిత్రాలతో పోల్చడం కామన్. ‘జేమ్స్ బాండ్’ సినిమాతో పోలిస్తే నేను చాలా హ్యాపీ.

ఆ స్థాయికి రీచ్ అయ్యామంటే గెలిచినట్లే కదా. మళ్లీ డైరెక్షన్‌‌‌‌ చేసే ఆలోచన ఉంది. అదికూడా స్పై జానర్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటుంది. నిజానికి ఐదేళ్ల క్రితం ‘ఏజెంట్‌‌‌‌’ టైటిల్‌‌‌‌ను అందుకోసమే రిజిస్టర్ చేయించా. త్వరలోనే మరో టైటిల్‌‌‌‌తో స్టార్ట్ చేస్తాం. ఇక ‘భోళాశంకర్‌‌‌‌‌‌‌‌’ యాక్షన్ సీన్స్ తీస్తున్నాం. ఆగస్టు 11న విడుదల కానుంది’ అని చెప్పారు.