
ఏజెంట్(Agent) మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులని సొంతం చేసుకున్న సోనీ లీవ్(Sony liv) సంస్థ ఈమేరకు ట్వీట్ కూడా చేసింది. దీంతో అక్కినేని అభిమానులు షాక్ అవుతున్నారు. సినిమా రిలీజై మూడు వారాలు కూడా కాకుండానే ఓటీటీ లోకి రావడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో.. చాలా థియేటర్స్ లో నుండి ఈ సినిమాని తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవడం కష్టమని భావించిన మేకర్స్.. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు తాజాగా స్ట్రీమింగ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిజిటల్ హక్కులని సొంతంచేసుకున్న సోనీ లీవ్ సంస్థ మే 19న ఓటీటీలో ఏజెంట్ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్లు ట్వీట్ చేసింది.
ఈ మూవీ థియేటర్లలో ఏప్రిల్ 28న విడుదలైంది. అంటే సరిగ్గా మూడు వారాలకు ఓటీటీలో విడుదల కానుంది. ఒక పెద్ద సినిమా మరీ మూడు వారాలకు ఓటీటీ బాట పట్టడం బహుశా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీని సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. మలయాళ స్టార్ మమ్ముట్టి కీ రోల్ చేసిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.