తెలుగు బదులు ఇంగ్లీష్ మీడియం...ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం

తెలుగు బదులు ఇంగ్లీష్ మీడియం...ఓపెన్ ఇంటర్ పరీక్షలో గందరగోళం

ఓపెన్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్షలో గందరగోళం నెలకొంది. మే 2వ తేదీన జరగాల్సిన ఓపెన్ స్కూల్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్ష రద్దు అయింది. పరీక్ష కేంద్రాలకు తెలుగు మీడియం బదులుగా ఆంగ్ల మాధ్యమం ప్రశ్న పత్రాలు అధికారులు పంపారు. అయితే పరీక్ష కేంద్రాల్లో చివరి నిమిషంలో ఇన్విజిలేటర్ట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గుర్తించిన టాస్...ఓపెన్ స్కూల్ ఇంటర్ ఎకనామిక్స్ పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  రద్దయిన  పరీక్షను మే 13న నిర్వహిస్తామని తెలిపింది.  

జగిత్యాల జిల్లాలో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. తెలుగు మీడియంకు బదులు పేపర్ ఇంగ్లీష్ లో ఉండటంపై ఆందోళన చెందారు. తిప్పన్నపేట గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో పరీక్ష నిర్వహించారు. అయితే  పరీక్ష రాసేందుకు విద్యార్థులు హాల్లో రెండు గంటలు  ఎదురు చూశారు.  పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులను గంటలు గంటలు కూర్చోబెట్టి నిర్వహకులు నరకం చూపించారు. అయితే  ఎకనామిక్స్ పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉండటందతో చివరకు పరీక్షను రద్దు చేసనట్లు డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తమను గంటల తరబడి కూర్చోబెట్టడంపై అభ్యర్తులు తీవ్రంగా మండిపడ్డారు. అన్ని ఎగ్జామ్ సెంటర్లలో ఇదే పరిస్థితి నెలకొందని అభ్యర్థులు తెలిపారు.