జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత

 జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత

రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఆందోళనకు రైతుసంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు జంతర్ మంతర్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. సిమెంట్ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జంతర్ మంతర్ దగ్గర దీక్షకు అనుమతి లేదని ఇప్పటికే ఢిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. ఇటు ఢిల్లీ-హర్యానా టిక్రీబోర్డర్ దగ్గర పోలీసులు మోహరించారు. ఢిల్లీకి రైతు సంఘాల నేతలు చేరుకున్నారు. రైతులకు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.