అంకుల్ మా అమ్మను..మా నాన్నే చంపాడు

అంకుల్ మా అమ్మను..మా నాన్నే చంపాడు

అక్రమ సంబంధం గురించి నిలదీసిందని భార్యను కాల్చి చంపాడో కసాయి భర్త. ఆపై హత్యకేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు ఓ కట్టు కథ చెప్పాడు. పెళ్లికి వెళ్లి వచ్చే సరికి దోపిడి దొంగలు నా భార్యను కాల్చి చంపి రూ.1.5లక్షలు నగదు దోచుకున్నారని పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పిల్లల్ని చెప్పిన అమాయకపు మాటల్లో అసలు నిందితుడు భర్తేనని గుర్తించి కటకటాల వెనక్కి నెట్టారు.

ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో రాఖీ, నేత్రాపాల్ సింగ్ లు భార్య భర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. భర్త నేత్రాపాల్ పెళ్లై పిల్లలున్నా మరో మహిళతో అక్రమ సంబంధం నెరిపేవాడు. ఆ విషయంపై భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఓ సమయంలో  అక్రమ సంబంధంపై భార్య రాఖీ భర్త నేత్రాపాల్ ను నిలదీసింది. దీంతో కోపోద్రికుడైన నేత్రాపాల్ భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. నేరం తనపై పడకుండా సినీ ఫక్కీలో పోలీసులకు ఓ స్టోరీ చెప్పాడు. దోపిడీ దొంగలు నా భార్యను  హత్య చేసి నగదు దోచుకెళ్లారంటూ దొంగఏడుపు ఏడ్చాడు. నేత్రాపాల్ ఫిర్యాదుతో పోలీసులు బాధితురాలి మృతిపై విచారణ ప్రారంభించారు. పోలీసులు విచారణలో నేత్రాపాల్ బాగానే మ్యానేజ్ చేశాడు. పోలీసులు సైతం నేత్రాపాల్ చెప్పింది నిజమేనని, నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు పోలీసులు నేత్రాపాల్ పిల్లల్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అంకుల్ మా నాన్న మా అమ్మని చంపాడు అంటూ అమాయకంగా చెప్పారు. పిల్లలు చెప్పిన మాటలు పోలీసులకు అర్ధం కాకపోవడంతో నేత్రాపాల్ ను  తనదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బట్టబయలైంది. అక్రమ సంబంధం గురించి అడిగినందుకే తన భార్యను తుపాకీతో కాల్చి చంపినట్లు నిందితుడు   ఒప్పుకున్నాడు. దీంతో నిందితుణ్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు