మే 11న ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలు...స్టూడెంట్ల ఫోన్లకే మార్కులు, ర్యాంకులు

మే 11న  ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలు...స్టూడెంట్ల ఫోన్లకే మార్కులు, ర్యాంకులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఫలితాలు ఈ నెల 11న రిలీజ్ కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం నివాసంలో రిజల్ట్ విడుదల చేస్తారని ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూలో ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ సమావేశం జరిగింది. ఫలితాల రిలీజ్ పై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 

పరీక్షలు పూర్తయిన ఆరు రోజుల్లోనే ఫలితాలు ఇవ్వనుండటం అభినందనీయమని, దీనికి కృషి చేసిన సిబ్బందిని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్  బాలకిష్టారెడ్డి ప్రశంసించారు. ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫలితాలను ఈ ఏడాది స్టూడెంట్ల ఫోన్లకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం రిజల్ట్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే  విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు పంపించనున్నారు. అలాగే.. https://eapcet.tgche.ac.in వెబ్ సైట్లోనూ ఫలితాలు పెట్టనున్నారు.