తెలంగాణలో 2 లక్షల 20 వేల ఎకరాల్లో పంట నష్టం..కామారెడ్డిలో 77 వేల ఎకరాలు..ఏ జిల్లాలో ఎంత నష్టం అంటే?

తెలంగాణలో 2 లక్షల 20 వేల ఎకరాల్లో పంట నష్టం..కామారెడ్డిలో 77 వేల ఎకరాలు..ఏ జిల్లాలో ఎంత  నష్టం అంటే?

తెలంగాణలో గత మూడు రోజులుగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి.  గత మూడు రోజులుగా మెదక్, కామారెడ్డి,ఆదిలాబాద్,నిజామాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జనజీవనం అస్తవ్యవస్థమయ్యింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు తెగిపోతున్నాయి.ఊర్లకు ఊర్లు  మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది.రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

 భారీ వర్షాల కారణంగా పంట నష్టాలపై ఆగస్టు 29 ప్రాథమిక రిపోర్ట్ విడుదల చేసింది వాతావరణ శాఖ.  ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పంటలకు తీవ్ర నష్టం కలిగించాయని తెలిపింది.  వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ప్రకారం మొత్తం 28 జిల్లాల్లో 2 లక్షల 20 వేల443 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని... రాష్ట్రవ్యాప్తంగా లక్షా 43 వేల 304  మంది రైతులు నష్టపోయారని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

 అత్యధికంగా కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పంటల నష్టం ఎక్కువగా నమోదైంది. కామారెడ్డి జిల్లాలోనే 77 వేల394  ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో 23 వేల169  ఎకరాలు, ఆదిలాబాద్‌లో 21 వేల276 ఎకరాలు, నిజామాబాద్‌లో 18 వేల 417 ఎకరాలు, కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో 15 వేల 317 ఎకరాల్లో పంటలు నష్టపోయాయి.  

ఆ తర్వాత అత్యధికంగా నష్టపోయిన జిల్లాల్లో మంచిర్యాల,ఖమ్మం, నిర్మల్, సూర్యపేట, సిద్దిపేట సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల ,పెద్దపల్లి, వనపర్తి, భూపాలపల్లి, మహబూబ్ నగర్ , ములుగు,సిరిసిల్లా, నాగర్ కర్నూల్, నల్గొండ, జగిత్యాల రంగారెడ్డి, కరీంనగర్, మేడ్చల్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. 

జిల్లాల వారీగా చూస్తే వరి పంట అత్యధికంగా దెబ్బతింది. మొత్తం 1.09 లక్షల ఎకరాలు వరి నీట మునిగింది.  పత్తి 60 వేల ఎకరాలు నష్టం చవిచూసింది.  మెక్కజొన్న 16 వేల ఎకరాలు,  వేరుశనగ 20వేల 900 ఎకరాల్లో దెబ్బతింది.  సోయాబీన్, టమాట, మిర్చి, మినుములు, ఇతర హార్టికల్చర్ పంటలు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయని తెలిపింది.