ఫోటోలు తీసి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు.. జనగామ జిల్లాలో ఏవోపై లైంగిక వేధింపుల కేసు, అరెస్టు

ఫోటోలు తీసి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు.. జనగామ జిల్లాలో ఏవోపై లైంగిక వేధింపుల కేసు, అరెస్టు
  •     ఫోటోలు తీసి అసభ్యంగా సోషల్​మీడియాలో పోస్టులు
  •     కలెక్టర్​ఆదేశాలతో వ్యవసాయ అధికారిపై కేసు, అరెస్టు

జనగాం రూరల్, వెలుగు: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ఫొటోలను వారి అనుమతి లేకుండా తీసి, మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో పోస్టు చేసిన వ్యవసాయ అధికారి (ఏవో) విజయ్‌‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళా ఉద్యోగి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సైబర్ క్రైమ్ పోలీసులు, ఐటీ మానిటరింగ్ సెల్ ద్వారా విచారణ చేయించారు. ఎంక్వైరీలో ఒక్క మహిళ మాత్రమే కాకుండా పలువురు మహిళా అధికారులు కూడా బాధితులుగా ఉన్నట్లు గుర్తించారు. 

అనంతరం అంతర్గత కమిటీ విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్‌‌రెడ్డిపై బీఎన్‌‌ఎస్ సెక్షన్లు 75, 77, 78, 79, 296(బీ)తో పాటు ఐటీ చట్టంలోని 66ఈ, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఘటన అనంతరం వ్యవసాయ శాఖలో ఒకే చోట చాలా కాలంగా పనిచేస్తున్న ఏవోలను బదిలీ చేసినట్లు సమాచారం. ఫిర్యాదుపై వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్​కుమార్​ఝాకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.