గంటలో 40 వేల పానీపూరీలు.. యువ ఇంజినీర్ అద్భుతం

 గంటలో 40 వేల పానీపూరీలు.. యువ ఇంజినీర్ అద్భుతం

అహ్మదాబాద్‌కు చెందిన ఆకాష్ గజ్జర్ అనే ఇంజనీర్ పరిశుభ్రమైన పానీ పూరీలను తయారు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. అవును, మీరు చదివింది నిజమే. కొంతమంది వ్యక్తులు తమ చేతులు, కాళ్లతో పానీ పూరీ పిండిని తొక్కుతూ తయారు చేస్తున్న వైరల్ వీడియోను గజ్జర్ చూశారు. ఆ ప్రక్రియను సులభతరం చేసే యంత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. గజ్జర్ తయారు చేసిన ఈ యంత్రం 1 గంటలో 40వేల పానీ పూరీలను ఉత్పత్తి చేయగలదు.

గుజరాత్ ఇంజనీర్ రూపొందించిన ఈ పానీ పూరీ తయారీ యంత్రంలో నాలుగు బెల్టులు ఉంటాయి. ముందుగా మెషిన్ లో మైదా, నీరు కలపాలి. అలా పిండిని తయారు చేసి, దాన్ని ఆపై డౌ షీట్ కు పంపుతుంది. ఆ తర్వాత అది కట్టింగ్ మెషీన్‌కు తరలించబడుతుంది. అలా పిండి నుంచి పానీ పూరీ ఆకారం తయారు చేయబడుతుంది. ఇది పూర్తయిన తర్వాత, యంత్రం మొత్తం వస్తువును వస్త్రంపైకి బదిలీ చేస్తుంది. ఈ ఉడకని పానీ పూరీ ఇప్పుడు నూనెలో వేయించడానికి సిద్ధంగా ఉంటుంది.

బయటకు తీసిన ఈ పూరీలు క్రిస్పీగా, తినడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ఫోర్-బెల్ట్ యంత్రం పూర్తిగా స్వయంచాలకంగా ఉంటుంది. ప్రతి పనిని యంత్రం మాత్రమే నిర్వహిస్తుంది, పూర్తి చేస్తుంది.

విదేశాలకూ డెలివరీ..

గజ్జర్ ప్రకారం, ఈ యంత్రాన్ని పట్టి సమోసాలు, శక్కర్‌పరా, మథియా, పాపడ్‌లను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. యూఎస్‌లో నివసించే గుజరాతీలు ఈ మెషిన్ నుంచి ముఖ్యంగా ప్రయోజనం పొందుతారు. అంతే కాదు దీన్ని గజ్జర్.. ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. ఈ మెషిన్ ను 2022లో గజ్జర్ కు నిర్మించడానికి రూ.7.85 లక్షలు ఖర్చయింది.