
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద ఆశీర్వచనం తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలను దేవాదాయ కమిషనర్, ఆలయ అధికారులు పీఠాధిపతికి అందజేశారు. దర్శనం అనంతరం భక్తులకు మంగళ శాసనములను అహోబిలం పీఠాధిపతి అందజేశారు.