న్యూఢిల్లీ: చాలా రంగాల్లో రాగి వాడకం విపరీతంగా పెరుగుతోందని, 2040 నాటికి దీని డిమాండ్ 42 మిలియన్ మెట్రిక్ టన్నులకు (ఎంటీలు) చేరుకుంటుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. దీని ప్రకారం.. సరఫరాలో తగినంత వృద్ధి లేకపోతే 2040 నాటికి 10 ఎంటీల కొరత ఏర్పడవవచ్చు.
ఇండస్ట్రీలు, ఏఐ సంస్థలు, డేటా సెంటర్లు, రక్షణ రంగ కంపెనీలు రాగిని విపరీతంగా ఉపయోగిస్తున్నాయి. నిర్మాణ రంగంలో రాగి వాడకం 2040 నాటికి 9.7 ఎంటీలకు చేరుతుందని అంచనా. ఇందులో ఆసియా దేశాల వాటానే 60 శాతం ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏసీల సంఖ్య 4.5 బిలియన్లకు చేరడం కూడా డిమాండ్‌కు ఊతమిస్తోందని ఈ రిపోర్టు వివరించింది.
