ఆగస్టు 22న దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాలు ముట్టడిస్తాం: కేసీ వేణుగోపాల్

 ఆగస్టు 22న  దేశ వ్యాప్తంగా  ఈడీ కార్యాలయాలు ముట్టడిస్తాం: కేసీ వేణుగోపాల్

సెబీ చీఫ్ పై హిండెన్ బర్గ్ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు..  ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా.. ఆగస్టు 22న అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాలు ముట్టడించనున్నట్లు తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మదాభీ బుచ్.. వెంటనే సెబీ చీఫ్ పదివికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లలో జరిగిన మెగా స్కామ్ పై కేంద్రం జేపీసీ వేయాలన్నారు. ఏఐసీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు కేసీ వేణుగోపాల్.  

ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన ఆగస్టు 13న  జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది  కాంగ్రెస్ హైకమాండ్.కలగణన, రిజర్వేషన్లపై యాక్షన్  ప్లాన్ రెడీ చేసింది .కులగణన, రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించనుంది. ప్రతి బహిరంగ సభలో లోక్ సభప్రతిపక్ష నేత రాహుల్ గాందీ పాల్గొననున్నారు. 

సమావేశంలో హర్యానా, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, బిహార్, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు.  కుల గణన జరిగితే వెనుబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతదంటోంది కాంగ్రెస్. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ , ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.