
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. బీజేపీ.. బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రధాని మోడీకి కనపడటం లేదా అని ఖర్గే ప్రశ్నించారు.
ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు కాంగ్రెస్ ఓడిపోదని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాళేశ్వరంలో లక్షల కోట్లు అవినీతి జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ నిజాలు చెప్పరు.. అలాగే ఆయన సోదరుడు కేసీఆర్ కూడా నిజం చెప్పరన్నారు. బీజేపీ పేదల వ్యతిరేకపార్టీ అని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.