
సాధారణంగా భారతీయ కుటుంబాలలో పిల్లలతో కొన్ని విషయాలు మాట్లాడటానికి తల్లిదండ్రులు సంకోచిస్తారు. ముఖ్యంగా లైంగిక ఆరోగ్యం, పార్టీలు, స్వేచ్ఛ వంటి విషయాలపై చర్చలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే, ప్రముఖ నటి రోష్ని వాలియా (Roshni Walia) తన తల్లి పెంపకం గురించి పంచుకున్న వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్యూలో రోష్ని వాలియా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన తల్లి ఇచ్చిన బోల్డ్ సలహాలను బహిరంగంగా వెల్లడించింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
"రక్షణ వాడండి" - తల్లి బోల్డ్ సలహా
మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని 'రక్షణ వాడండి' (Use Protection) అని చెబుతూనే ఉంటుంది అని రోష్ని వాలియా పంచుకున్నారు. సురక్షితమైన శృంగారం గురించి భారతీయ కుటుంబాలలో మాట్లాడటం ఇప్పటికీ ఒక నిషేధంగా ఉంది. అయితే తన తల్లి ఈ విషయంలో ఎప్పుడూ సంకోచించలేదని ఆమె తెలిపారు. రోష్ని తల్లి ఈ విషయాన్ని తన అక్కకు, ఆ తర్వాత రోష్ని యుక్తవయస్సులోకి వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఇది లైంగిక ఆరోగ్యం పట్ల వారి కుటుంబానికి ఉన్న బాధ్యతాయుతమైన వైఖరిని తెలియజేస్తుందని వాలియా చెప్పారు..
బయటకు వెళ్ళండి.. ఆనందించండి
భద్రతతో పాటు, జీవితాన్ని ఆనందించే విషయంలో కూడా రోష్ని తల్లి తన కూతుళ్లకు స్వేచ్ఛనిచ్చారు. ఇంట్లోనే ఉండిపోవాలని కాకుండా, బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవాలని, యువతగా తమ కాలాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఆమె ప్రోత్సహించేవారట. మిమ్మల్ని మీరు కోల్పోకండి (Don’t lose yourself) అని తన తల్లి చెప్పిన మాటలను రోష్ని గుర్తు చేసుకున్నారు. ఇది తమ బాధ్యతాయుతంగా జీవిస్తూనే స్వేచ్ఛను ఆస్వాదించాలనే ఉద్దేశంతో తన తల్లి చెప్పినట్లు వెల్లడించింది.
కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుతూ కఠినమైన తల్లిదండ్రుల పిల్లలు ఎక్కువగా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. అయితే స్వేచ్ఛనిచ్చే తల్లిదండ్రుల పిల్లలు మరింత నిజాయితీగా ఉంటారు అని రోష్ని వాలియా అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడరన్ మమ్మీ, చాలా ఓపెన్ మైండ్‌డ్, స్వేచ్ఛకు నిలువెత్తు ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరూ భిన్నంగా స్పందిస్తున్నారు. మొత్తానికి రోష్ని పంచుకున్న ఈ అనుభవాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
►ALSO READ | Movie Piracy India: మూవీ పైరసీకి పాల్పడితే మూడేండ్ల జైలు శిక్ష: కేంద్రం సంచలన నిర్ణయం