
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో భారీ ఊరట దక్కింది. షేర్ల బదిలీని నిలిపివేయాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) మంగళవారం ( జులై29) తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ నుంచి తన కుటుంబసభ్యులు అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ 2024 సెప్టెంబర్‌లో పిటిషన్ వేశారు. నియమాలకు విరుద్దంగా తన ప్రమేయం లేకుండా షేర్లు బదిలీ జరిగాయని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వాటాల పత్రాలు.. బదిలీకి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పిస్తేనే కంపెనీ వాటాలను బదలాయించాల్సి ఉందని జగన్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వైఎస్ జగన్ పిటిషన్ పై 10 నెలల పాటు విచారణ జరిగింది. NCLT జ్యుడీషియల్ సభ్యులు రాజీవ్ భరద్వాజ్.. సంజయ్ పురి విచారించి రెండు వారాల క్రితం తీర్పును రిజర్వ్ చేసి .. చివరకు ఈరోజు ( జులై 29) తుది తీర్పు ప్రకటించారు. సీబీఐ, ఈడీ కేసులు విచారణలో ఉన్న కంపెనీల్లో షేర్ల బదిలీలు సాధ్యం కాదని NCLT తీర్పు వెలువరించింది.
సరస్వతి’ షేర్ల బదిలీ అక్రమమే అని పేర్కొంది NCLT.. షేర్ల బదిలీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్.. అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్న వారికి ట్రిబ్యునల్ షాక్ ఇచ్చింది. . కంపెనీ యాక్ట్ 59 కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్న వారి షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని ట్రిబ్యునల్‌ను విజ్ఞప్తి చేశారు.. 10 నెలలుగా అన్ని పక్షాల వాదనలు విని ఈ నెల 15న తీర్పు రిజర్వు చేసిన బెంచ్.. షేర్ల బదిలీ నిలిపివేస్తూ ఈ రోజు ( జులై 29) ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్..