
- ఏఐసీసీ సెక్రటరీ ఇన్చార్జి విశ్వనాథన్
పద్మారావునగర్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఓట్ చోరీలకు పాల్పడుతోందని ఏఐసీసీ సెక్రటరీ ఇన్చార్జి పి.విశ్వనాథన్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆరోపించారు. మంగళవారం ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్‌ను బాలంరాయి చౌరస్తాలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో దేశం ప్రమాదంలో ఉందని, దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఓట్లు చోరీ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వివిధ మాధ్యమాల ద్వారా ఈ బాగోతాన్ని ఎండగడుతున్నారని చెప్పారు. ఆయన పోరాటానికి మద్దతుగా కంటోన్మెంట్ లో ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రపతి ముర్ముకు పంపేందుకు సంతకాల సేకరణ చేపట్టారు.