- ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రుజువైందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం మూడు నెలలు కాంగ్రెస్ క్యాడర్ కష్టపడిందని తెలిపారు.
ప్రభుత్వ పనితీరు, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలిచామని చెప్పారు. సీఎం, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నాయకత్వం తో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని స్పష్టమైందన్నారు.
