నాగర్కర్నూల్ జిల్లాలో ఒకే వేదికపై ఒక్కటైన 61 జంటలు

నాగర్కర్నూల్ జిల్లాలో ఒకే వేదికపై ఒక్కటైన 61 జంటలు

అచ్చంపేట, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లాలో సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట టౌన్ లోని బీకే ఫంక్షన్ హాల్ లో కౌన్సిలర్ గోపిశెట్టి శివ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వేడుకకు ముఖ్యఅతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ అనురాధ దంపతులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి చెందిన 61 జంటలకు ఒకే వేదికపై పెండ్లి జరిపించారు. వధూవరులకు నిర్వాహకులు పుస్తె మట్టెలతో పాటు, గృహోపకరణ వస్తువులు అందించారు.

 జంటల తరఫున హాజరైన కుటుంబసభ్యులు, బంధువులకు భోజన సదుపాయం కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా సామూహిక వివాహాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం టౌన్ లో భారీ ఊరేగింపు తీశారు. కార్యక్రమంలో ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బీరం మాధవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేశ్, నేతలు గౌరీ శంకర్, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.