అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
  • 40 కిలోల కాపర్​ కాయిల్స్​ రూ.5.5 లక్షల క్యాష్​ స్వాధీనం

నిజామాబాద్, వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను నిజామాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. పది మంది ముఠాలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని 40 కిలోల కాపర్​కాయిల్స్​, రూ.5.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సీపీ సాయిచైతన్య మీడియాకు వివరాలు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన తంబారె సుధాకర్​ఆధ్వర్యంలో యూపీకి చెందిన హరిబల్ శర్మ, వలీ, ఏపీకి చెందిన యడాల వెంకటేశ్వర్లు, మేడ్చల్​వాసి అనిల్, డిచ్​పల్లికి చెందిన అలీ మహ్మద్, మహబూబ్​నగర్​కు చెందిన శానంపల్లి రవీందర్, మెదక్​వాసి లింగప్ప, సిద్దిపేటకు చెందిన గాజుల శ్రీశైలం, హైదరాబాద్​కు చెందిన మహ్మద్​హైదర్ ​అలీ ముఠాగా ఏర్పడ్డారు.

 వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ ఫారాల్లోని కాపర్​కాయిల్స్​చోరీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 101 ట్రాన్స్​ఫార్మర్లను  ఎత్తుకెళ్లగా 44 కేసులు నమోదు అయ్యాయి. ఇందల్ వాయి మండలం గన్నారం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు వీరు పట్టుబడ్డారు. అనిల్, వలీ తప్ప మిగతా ఎనిమిది మందిని అరెస్టు చేశారు.