నిల‌క‌డ‌గానే మ‌న్మోహన్‌సింగ్ ఆరోగ్యం

నిల‌క‌డ‌గానే మ‌న్మోహన్‌సింగ్ ఆరోగ్యం

న్యూఢిల్లీ: ‌ఛాతీలో నొప్పి రావ‌డంతో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహన్ ‌సింగ్ ఆదివారం సాయంత్రం ఎయిమ్స్ హాస్పిట‌ల్ లో చేరిన విష‌యం తెలిసిందే. అయితే మ‌న్మోహ‌న్ సింగ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ ‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే స్వ‌ల్పంగా జ్వ‌రం ఉన్న‌ద‌ని, ఛాతీనొప్పి త‌గ్గ‌డానికి ఇచ్చిన‌ ఔషధాలవ‌ల్ల జ్వ‌రం వ‌చ్చి ఉంటుంద‌ని డాక్ట‌ర్లు తెలిపిన‌ట్లు చెప్పింది ఎయిమ్స్.

జ్వ‌రానికి ఇత‌ర కార‌ణాలేమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు అన్ని ర‌కాల వైద్య‌ ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. మ‌న్మోహ‌న్‌సింగ్ ‌కు 2009లో బైపాస్ స‌ర్జ‌రీ జ‌రిగింది. 2004 నుంచి 2014 వ‌ర‌కు రెండు ప‌ర్యాయాలు దేశ ప్ర‌ధానిగా ప‌నిచేసిన మ‌న్మోహ‌న్‌.. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.