
వీరనారి చాకలి ఐలమ్మది పోరాట చరిత్ర అని ఆమె ముని మనవరాలు శ్వేత గుర్తు చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే చాకలి ఐలమ్మలా తిరగబడాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 జయంతి వేడుకల్లో ఆమె మనవరాలు శ్వేత మాట్లాడారు. రవీంద్రభారతిలో ఐలమ్మ జయంతి వేడుకలు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, బీసీ కమిషన్ చైర్మన్, మహిళ కమిషన్ సభ్యురాలు చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేత హాజరైయ్యారు.
ALSO READ: చాకలి ఐలమ్మ త్యాగానికి గుర్తుగా..మహిళా యూనివర్సిటీకి ఆమె పేరుపెట్టాం: మంత్రి పొన్నం
భూమి కోసం, భూక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన ఘనత ఐలమ్మది అని శ్వేత అన్నారు. ఆమె దొరతనానికి దిక్కార స్వరమైన, బలహీన వర్గాల పక్షాన నిలిచింది. బీసీ మహిళా ఐలమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే గుర్తించిందని ఆమె అన్నారు. గతంలో ప్రభుత్వం మాకు ఆహ్వానం ఇవ్వలేదని ఐలమ్మ మనమరాలు శ్వేత తెలిపారు. కులం పేరు చెప్పడానికి చాలా మంది రజకులు ఎందుకు సిగ్గు పడుతున్నారని ఆమె ప్రశ్నించారు. మన కులమే మనకు బతుకు దారి చూపిస్తుందని చెప్పుకొచ్చారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మహిళా కమిషన్ సభ్యురాలు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.