ఇల్లెందు జేకే ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌ మైన్‌‌‌‌కు ఈసీ క్లియరెన్స్‌‌‌‌

ఇల్లెందు జేకే ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌ మైన్‌‌‌‌కు ఈసీ క్లియరెన్స్‌‌‌‌

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇల్లెందులోని జేకే ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌ మైన్‌‌‌‌కు శుక్రవారం ఈసీ క్లియరెన్స్‌‌‌‌ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న జేకే 5 ఓపెన్‌‌‌‌కాస్ట్‌‌‌‌ వచ్చే నెలలో మూతపడనుంది. ఈ క్రమంలో మైన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌టెన్షన్‌‌‌‌లో భాగంగా రొంపేడు, పూసపల్లి ప్రాంతాన్ని సింగరేణి యాజమాన్యం తెరమీదకు తీసుకొచ్చింది. ఈ మైన్‌‌‌‌కు అవసరమైన పర్మిషన్స్‌‌‌‌ కోసం మూడు, నాలుగేండ్లుగా యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. సీఎండీ ఎన్‌‌‌‌.బలరాం నాయక్‌‌‌‌ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈసీ క్లియరెన్స్‌‌‌‌ ఓకే అయింది. 

ఈ మైన్‌‌‌‌ ద్వారా ప్రతి ఏడాది సుమారు 2.5 మిలియన్‌‌‌‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యం ప్లాన్‌‌‌‌ చేసింది. ఈ మైన్​లైఫ్​సుమారు 15 నుంచి 20 ఏండ్ల వరకు ఉండనుంది. ఈ మైన్‌‌‌‌కు సంబంధించి ఓవర్‌‌‌‌ బర్డెన్‌‌‌‌ టెండర్ల ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు. ఈసీ క్లియరెన్స్‌‌‌‌ పట్ల సింగరేణి కాలరీస్‌‌‌‌ వర్కర్స్‌‌‌‌ యూనియన్‌‌‌‌ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్‌‌‌‌ సెక్రటరీ కె. సారయ్య, బ్రాంచ్‌‌‌‌ సెక్రటరీ నజీర్‌‌‌‌ సంతోషం వ్యక్తం చేశారు.