
హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ 2024-–25 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్ ప్రకటించింది. సంస్థ చరిత్రలోనే ఇప్పటివరకు ఇదే అత్యధికమని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన రూ. 1,383 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. కంపెనీ పార్టిసిపేటింగ్ (లాభంతో) పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన 11.71 లక్షల మంది పాలసీదార్లకు దీనితో ప్రయోజనం చేకూరనుంది. వరుసగా 24 సంవత్సరాల నుంచి నిలకడగా వార్షిక బోనస్‌లు ప్రకటిస్తున్నామని బజాజ్ అలయంజ్ లైఫ్ తెలిపింది.
2025 మార్చి 31 నాటికి అమల్లో ఉన్న సంప్రదాయ పార్టిసిపేటింగ్ పాలసీలు గల వాళ్లు ఈ బోనస్‌ను పొందడానికి అర్హులు. బజాజ్ అలయంజ్ లైఫ్ ఏస్ (నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్), బజాజ్ అలయంజ్ లైఫ్ ఏస్ అడ్వాంటేజ్ (నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్), బజాజ్ అలయంజ్ లైఫ్ ఎలీట్ అష్యూర్ (నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్) సహా వివిధ పార్టిసిపేటింగ్ ప్రొడక్టులను బజాజ్ అలయంజ్ లైఫ్ అందిస్తోంది.