నేను చిటికేస్తే చాలు.. పోలీస్ అధికారికి అక్బరుద్దీన్ ఓపెన్ వార్నింగ్

నేను చిటికేస్తే చాలు.. పోలీస్ అధికారికి అక్బరుద్దీన్ ఓపెన్ వార్నింగ్

చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఓ పోలీసుకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతోష్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో 2023 నవంబర్ 21వ తేదీ రాత్రి ప్రచారం నిర్వహించారు అక్బరుద్దీన్. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన  సంతోష్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.శివచంద్ర ప్రచార సమయం అయిపోయిందని ఇక ముగించాలని ఒవైసీని కోరారు.  

ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ మండిపడ్డారు ఒవైసీ . మీ దగ్గర వాచ్  లేకపోతే చెప్పు నా వాచ్  ఇస్తా చూసుకో అంటూ సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా..  ఇన్‌స్పెక్టర్‌ దగ్గరకు వచ్చి..   ఇంకా ఐదు నిమిషాలు సమయం ఉందని, ఖచ్చితంగా తాను మాట్లాడి తీరునానన్నారు. తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదన్నారు అక్బరుద్దీన్ . 

అనంతరం చాంద్రాయణగుట్ట ప్రజలకు ఒక్క సైగ  చేస్తే పోలీసులంతా ఇక్కడి నుంచి పరుగులు పెడతారంటూ హెచ్చరించారు. తనపై తూటాలు, కత్తులతో దాడులు జరిగాయన్న ఒవైసీ .. అంతమాత్రాన అలసిపోయానని అనుకుంటున్నారా. తాను ఇప్పటికీ ఎంతో ధైర్యంగా, బలంగా ఉన్నానని, దయచేసి రెచ్చగొట్టొద్దంటూ మాట్లాడారు.  

ALSO READ : బీఆర్ఎస్​ లీడర్ల భూభాగోతం బయటపెడతాం : ఆవుల రాజిరెడ్డి