ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే ముందున్న లక్ష్యం

ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే ముందున్న లక్ష్యం
  • మీడియా సమావేశంలో  పీవీ సింధు 

హైదరాబాద్: ఒలింపిక్స్ లో  గోల్డ్ మెడల్ సాధించడమే తన ముందున్న లక్ష్యమని పీవీ సింధు స్పష్టం చేసింది. ఒలింపిక్స్ లో కాంస్యపతకం సాధించి సొంతింటికి తిరిగొచ్చిన పీవీ సింధుకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, పోలీసు కమిషనర్ సజ్జనార్ తదితరులు స్వయంగా స్వాగతం పలకడంతో పీవీ సింధు సంతోషంతో పొంగిపోయింది. తన మీద ప్రేమతో ఇంత మంది స్వాగతం పలకడం జీవితంలో మరచిపోలేని అనుభవం అని పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. నగరంలోని తన నివాసంలో కోచ్ తో కలసి మీడియాతో ఆమె మాట్లాడుతూ ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించడం గర్వంగా ఉందన్నారు. గత ఒలంపిక్స్ కంటే నా ఆట బాగా మెరుగైందన్నారు. లాక్ డౌన్ సమయంలో ఫిట్ నెస్ పై ఎక్కువ ద్రుష్టి పెట్టానని, అందుకే ఇంత ఫిట్ గా ఉన్నానని పీవీ సింధు వివరించింది.

నేను ఒలంపిక్ మెడల్ గెలవడంలో కోచ్ పార్క్ పాత్ర చాలా ఉందని,  నా కోచ్ పార్క్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సుచిత్ర అకాడమీ లో కోచ్ శ్రీకాంత్ దగ్గర ఫిట్నెస్ లో శిక్షణ తీసుకున్నానని,     ప్రతి కోచ్ దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని పీవీ సింధు వివరించింది. నేను గెలవాలని కోరుకున్న వారికి, నాకు విషెష్ తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నానని, తన విజయంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొంది. 2024 పారిస్ ఒలంపిక్స్ లోను ఆడతాననని, వచ్చే ఒలంపిక్స్ లో  గోల్డ్ మెడల్ సాధించడమే నా ముందున్న లక్ష్యం అని పీవీ సింధు స్పష్టం చేసింది.