కారుకు కవచాలు

కారుకు కవచాలు

సాధారణంగా కారు లోపల ఎయిర్ ​బ్యాగ్స్​ ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పెద్ద దెబ్బలు తగలకుండా లోపల ఉన్నోళ్లను అవి కాపాడతాయి. మరి, కారుకు బయట..? జర్మనీకి చెందిన జెడ్ ఎఫ్ ఫ్రెడ్రిచ్ షాఫెన్​ అనే కంపెనీకి అదే ప్రశ్న ఎదురైంది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. కారుకు బయట కవచాల్లాఉండే ఎయిర్ ​బ్యాగ్స్​ను తయారు చేసింది. వేరే కారు ఢీకొట్టేసేలోపు అవి తెరుచుకునేలా వాటిని రూపొందించింది.. సెన్సర్లు అందించే సమాచారంతో ఆ ఎయిర్​బ్యాగ్స్​ తెరుచుకుంటాయి. ఆ ఎయిర్​బ్యా గులపై కంపెనీ పరీక్షలు కూడా చేసింది. వాటి వల్ల లోపలున్నవాళ్లు గాయపడే ప్రమాదం 40 శాతం తగ్గు తుందని కంపెనీ చెబుతోంది. ప్రమాదాన్ని పసిగట్టేలా సెన్సర్లను వాటిలో ఏర్పాటు చేశారు. వీటిని కారు సీటుకే ఏర్పాటు చేస్తారు. సెన్సర్ల పనితీరులో లోపం ఉంటే అదో పెద్ద తలనొప్పిగా మారుతుంది. కాబట్టి ఆ లోపాలేవీ ఉండకుండా వివిధ రకాల సెన్సర్లు , రాడార్​, కెమెరాలు, లైడర్​ సెన్సర్లను వాడామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అవన్నీ కలిసి ప్రమాదాన్ని పసిగట్టేలా త్రీడీ ఇమేజ్ ను రూపొందిస్తాయని, కచ్చి తత్వంతో పనిచేస్తాయని అంటున్నారు.

ఎలా పనిచేస్తాయి….

ప్రమాద దూరాన్ని కరెక్ట్​గా అంచనా వేసేలా రాడార్​ సెన్సర్ లుంటాయి. ఏ వాతావరణంలో నైనా పనిచేస్తాయి. ప్రమాదానికి కారణమయ్యే వాహనం సైజు, బరువును ఎయిర్​ బ్యాగ్స్​లోని కెమెరాలు అంచనా వేస్తాయి. లారీలు, బైకులు, కార్లను కరెక్ట్​గా గుర్తిస్తాయి. లైడర్​ సెన్సర్లు కాంతి తరంగాలను ప్రమాదాని కి కారణమయ్యే వాహనం వైపు పంపిస్తాయి. ఆ కాంతి తరంగాలే రిఫ్లెక్ట్​ అయ్యి సెన్సర్లను చేరతాయి.అందులోని స్మార్ట్​ కంట్రోల్ యూనిట్లు ప్రమాదాన్ని విశ్లేషేంచి ఎయిర్ ​బ్యాగ్స్​ను రిలీజ్ చేసే టైంను అంచనా వేస్తాయి. కరెక్ట్​ టైంలో రిలీజ్ చేసి ప్రయాణికులను కాపాడతాయి.