రాఫెల్స్‌‌ దిగినయ్.. చైనా జే20 కంటే శక్తివంతమైనవి

రాఫెల్స్‌‌ దిగినయ్.. చైనా జే20 కంటే శక్తివంతమైనవి
  • అంబాలా చేరిన పవర్‌ఫుల్‌‌ ఫైటర్‌ జెట్స్‌‌
  • ఎదురెళ్లివెల్కమ్‌‌ చెప్పిన సుఖోయ్‌ విమానాలు
  • 17వ స్క్వాడ్రన్‌‌ గోల్డెన్‌‌ యారోస్‌లో సేవలు
  • ఇండియన్‌‌ ఎయిర్‌ఫోర్స్‌‌కు కొండంత బలం
  • చైనా జే20, పాక్‌ ఎఫ్‌‌16లను తలదన్నే ఫీచర్స్
ప్రపంచంలో అత్యుత్తమ యుద్ధ విమానాలుగా పేరున్నఅత్యాధునిక రాఫెల్‌‌ ఫైటర్‌‌ జెట్స్‌‌సురక్షితంగా  ఇండియా చేరుకున్నాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్‌‌ బేస్‌లో బుధవారం దిగాయి. జెట్స్‌‌ల్యాండ్ కాగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ చేశారు. మొత్తంగా ఇవి 7 వేల కిలోమీటర్లు ప్రయాణించాయి. న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యుత్తమ యుద్ధ విమానాలుగా పేరున్న అత్యాధునిక రాఫెల్‌‌‌‌ ఫైటర్‌‌‌‌ జెట్స్‌ ‌‌‌సురక్షితంగా ఇండియా చేరుకున్నాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్‌‌‌‌బేస్‌‌‌‌లో బుధవారం దిగాయి. ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌స్పేస్‌‌‌‌లోకి రాగానే సుఖోయ్‌ 30 ఎంకేఐ విమానాలు ఎదురెళ్లి వెల్కమ్‌‌‌‌ చెప్పాయి. ఎస్కార్ట్ తీసుకొచ్చాయి. జెట్స్‌‌‌‌ల్యాండ్ కాగానే సంప్రదాయం ప్రకారం వాటర్ సెల్యూట్ చేశారు.
సోమవారం బయలుదేరి..
ఫ్రాన్స్‌‌‌‌లోని మెరిగ్నాక్‌‌‌‌ఎయిర్‌‌‌‌బేస్‌ ‌‌‌నుంచి సోమవారం బయలు దేరిన ఐదు రాఫెల్స్‌‌‌‌.. 7 గంటలు ప్రయాణించి యూఏఈలోని అల్‌‌‌‌దఫ్రాఎయిర్‌‌‌‌బేస్‌‌‌‌లో ఆగాయి. అక్కడి నుంచి నేరుగా అంబాలా చేరుకున్నాయి. మొత్తంగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించాయి. అల్‌‌‌‌దఫ్రాకు చేరుకోవడానికి ముందు ఆకాశంలోనే 9 కిలోమీటర్లఎత్తులో ఇంధనం నింపుకున్నాయి. రాఫెల్స్‌‌‌‌తో పాటు వచ్చిన 2 ఏ330 ఫోనిక్స్‌‌‌‌ఎంఆర్‌‌‌‌టీటీ రీ ఫ్యూయెలింగ్‌ ప్లేన్ లు వాటికి ఇంధనం అందించాయి.
అంబాలాలోనే..
ఈ ఐదు రాఫెల్స్‌‌‌‌కూడా అంబాలాలోని 17వ స్క్వాడ్రన్‌‌‌‌(గోల్డెన్‌‌‌‌ యారోస్‌‌‌‌)లో వలందించనున్నాయి. ఇండియా, పాకిస్తాన్‌‌‌‌బార్డర్‌‌‌‌కు 220 కిలోమీటర్లదూరంలో ఉన్న ఈ వ్యూహాత్మక ఎయిర్‌‌‌‌బేస్‌‌‌‌లో రెడీగా ఉంటాయి. ఆగస్టులో రానున్న రెండో స్క్వాడ్రన్‌‌‌‌జెట్స్‌‌‌‌ పశ్చిమ బెంగాల్‌‌‌‌లోని హసిమరలో ఉంటాయి. ఐఏఎఫ్‌‌‌‌లోకి రాఫెల్స్‌‌‌‌ బుధవారమే చేరినా అధికారిక కార్యక్రమం మాత్రం ఆగస్టు మధ్యలో ఉంటుందని అధికారులు చెప్పారు. మెయింటెనెన్స్‌ కోసంరూ.400కోట్లు రాఫెల్స్‌‌‌‌షెల్టర్ లు, హ్యాంగర్లు, మెయింటెనెన్స్‌‌‌‌ సదుపాయాల కోసం అంబాలా, హసిమర ఎయిర్‌‌‌‌బేస్‌‌‌‌లలో కలిపి రూ.400 కోట్లు ఖర్చుచేశారు. ఇండియా,ఫ్రాన్స్‌‌‌‌మధ్య తొలి నుంచే ఫైటర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌‌‌లకు సంబంధించి సహకారంఉంది. 1953లో తొలిసారి తుఫానీస్‌‌‌‌ను ఫ్రాన్స్‌‌‌‌మనకు అందించింది. అటు తర్వాత మిస్టీర్‌‌‌‌, జాగూర్స్‌‌‌‌, మిరేజెస్‌‌‌‌ను పంపింది.
అత్యవసరంగారంగంలోకి..
మామూలుగా రాఫెల్స్‌‌‌‌ను పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడానికి 6 నెలలు పడుతుంది. అయితే అంబాలా చేరిన వారంలోపే వీటిని ఆపరేషన్స్‌‌‌‌లోకి దించే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా వాడకంలోకి తేనున్నట్టు సమాచారం. లడఖ్‌ ప్రాంతంలో ఉంచుతారని తెలిసింది. రాఫెల్‌‌‌‌కు సంబంధిం చిన పూర్తిస్థాయి వెపన్స్‌‌‌‌ అక్టోబర్‌‌‌‌నాటికి రానున్నాయి. అయితే మిసైల్స్‌‌‌‌లో కొన్ని ఇప్పటికే వచ్చాయని సమాచారం.
అల్ దఫ్రాలో రాఫెల్స్‌..అదేటైమ్‌‌‌‌లో సైరన్‌‌‌‌
మనరాఫెల్‌‌‌‌ యుద్ధవిమానాలు యూఏఈలోని అల్‌‌‌‌దఫ్రాలో ఆగిన టైమ్‌లో ఓఉత్కంఠ సంఘటన జరిగింది. ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి జరిగేటప్పుడుమోగే సైరన్స్‌‌‌‌ మోగాయి. ఇదేటైమ్‌లో ఖతర్‌లో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్‌ అల్‌‌‌‌ ఉదైద్‌‌‌‌లోనూ సైరన్‌‌‌‌ మోగింది. దీంతో బలగాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఇరాన్‌‌‌‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్  నిర్వహిస్తున్నయుద్ధవిన్యాసాల్లో భాగంగాకొన్ని క్షిపణులు ప్రయోగించారని, అవి అల్‌‌‌‌ దఫ్రాకు దగ్గర్లో సముద్రంలో పడిపోయాయని తెలిసింది.
2016లోఒప్పందం
ఎన్డీయేసర్కారు2016లో36రాఫెల్స్‌ కోసం ఫ్రాన్స్‌తోఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.59 వేలకోట్లు ఖర్చు చేస్తోంది. 10 రాఫెల్స్‌ డెలివర్‌‌‌‌ అయ్యాయని,ట్రైనింగ్‌ కోసం ఐదుఫ్రాన్స్‌లోనే ఉన్నాయనితాజాగాకేంద్రం వెల్లడించింది. 2021 చివరినాటికి 36 ఎయిర్‌‌‌‌ క్రాఫ్ట్‌లడెలివరీ పూర్తవుతుందని తెలిపింది. రష్యానుంచి సుఖోయ్‌జెట్స్‌‌‌‌ను కొనుగోలు చేసిన తర్వాత అతిపెద్ద డీల్‌‌‌‌ మళ్లీ రాఫెల్స్‌దే. మన ఐఏఎఫ్‌‌‌‌లో42ఫైటర్‌‌‌‌ స్క్వాడ్రన్స్‌ఉండాల్సి ఉండగా ఆసంఖ్య 31కి తగ్గింది. దీంతో కేంద్రం అర్జెంటుగా రాఫెల్స్‌‌‌‌ను కొనుగోలుచేసింది.
రకరకాలమిసైల్స్‌‌‌‌ వాడొచ్చు
మీటియోర్స్‌, స్కల్ప్‌‌‌‌ క్రూయిజ్‌మిసైళ్లు,మికావెపన్స్‌లను రాఫెల్స్‌తోప్రయోగించవచ్చు. ఆకాశం నుంచి మిపైకిప్రయోగించేహామర్‌‌‌‌ మిసైళ్లను కూడాఐఏఎఫ్‌‌‌‌ వాడబోతోంది. ఇందుకోసం ఫ్రాన్స్‌తోఒప్పందం చేసుకుంది. హామర్స్‌‌‌‌ను ఫ్రాన్స్‌ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌,నావీ కోసం తయారుచేశారు.మీటియోర్స్‌ విషయానికి వస్తే.. ఇవిబీవీఆర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ టు ఎయిర్‌‌‌‌ మిసైల్స్‌కు అడ్వాన్డ్స్‌ వెర్షన్‌‌‌‌. వీటిలో రాకెట్‌‌‌‌  రామ్‌‌‌‌జెట్‌‌‌‌ మోటార్‌‌‌‌ వాడారు.ప్రపంచంలోని మిగతా మిసైళ్లతో పోలిస్తే ఇవి ఎక్కువ దూరం వెళ్లగలవు.
చైనా జే20కి మించి
చైనా దగ్గరున్న అడ్వాన్స్డ్‌ ఫైటర్‌ జెట్స్‌జే20చెంగ్డూ. ఇవి ఐదోతరం కాంబాట్‌జెట్స్‌.మనరాఫెల్స్‌ 4.5తరం జెట్స్‌. అయితేచైనా జెట్స్‌ కు కాంబాట్‌ ఎక్స్‌పీరియెన్స్‌లేదు. ఫ్రాన్స్‌ ఇప్పటికే లిబియా,మాలీ, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్స్‌లో రాఫెల్స్ను వాడింది. జే20తో పోల్చుకుం టేఎక్కువ వెపన్స్‌‌‌‌‌‌‌‌ను, ఎక్కువ ఫ్యూయెల్‌‌‌‌‌‌‌‌ను మోసుకెళ్లగలవు.రాఫెల్‌‌‌‌‌‌‌‌ తన బరువుకన్నా 1.5 రెట్లు ఎక్కువ బరువును మోసుకెళ్తాయి. అంటే జే20 కెపాసిటీకన్నా ఎక్కువే. రాఫెల్‌‌‌‌‌‌‌‌కు,జే20కి ఉన్న పెద్దతేడా రాఫెల్స్‌ అన్ని పనులుచేసే ఎయిర్‌క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ లు.జే20 అలాకాదు.జే20 వెపన్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌కూడా అంతఅడ్వాన్డ్‌‌‌‌‌‌‌‌గాఏంలేదని ఎక్స్‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నారు.
పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌16ను రఫ్పాడిస్తయ్‌
పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ దగ్గరున్న ఎఫ్‌‌‌‌‌‌‌‌16 జెట్స్‌ అమ్‌రామ్‌మిసైల్స్‌‌‌‌‌‌‌‌ను వాడగలవు. వాటి రేంజ్‌‌‌‌‌‌‌‌ 75 కిలోమీటర్లు. మనదగ్గరున్నరాఫెల్స్‌..పాక్‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌ 16 డాగ్‌‌‌‌‌‌‌‌ఫైటర్స్‌కు డబుల్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌ఉన్నవి. 150 కిలోమీటర్ల వరకురేంజ్‌‌‌‌‌‌‌‌ ఉన్నమీటియోర్‌ మిసైల్స్‌‌‌‌‌‌‌‌ను ప్రయోగించగలవు. అంతకుమించి300 కిలోమీటర్ల రేంజ్‌‌‌‌‌‌‌‌ ఉన్న ఆకాశం నుంచి భూమిపైకి ప్రయోగించేస్కల్ప్‌‌‌‌‌‌‌‌ మిసైళ్లతో కూడా అటాక్‌‌‌‌‌‌‌‌ చేయగలవు. పైగాబంకర్‌‌‌‌‌‌‌‌ లాంటిగట్టి తలాలను కూడా తునాతునకలు చేసే హామర్‌మిసైళ్ల కోసంఫ్రాన్స్‌తోఇండియా ఒప్పందం చేసుకుంది. ఆకాశం నుంచిభూమిపైకి ప్రయోగించేవీటిరేంజ్‌‌‌‌‌‌‌‌ 70 కిలోమీటర్లు. వీటినీరాఫెల్స్‌తోప్రయోగించొచ్చు.