
ఈమధ్య కాలంలో భోపాల్ లో 90డిగ్రీస్ కార్నర్ఫ్లైఓవర్గురించి విన్నాం..ఆ కోవకు చెందిన మరో ఫ్లైఓవర్ ఇప్పుడు నాగ్‌పూర్‌లో కూడా వెలుగులోకి వచ్చింది.. ఈ ఫ్లైఓవర్లు కట్టిన ఇంజనీర్ల ప్రతిభకు జనం వహ్వా..వహ్వా అంటున్నారు. ఈ ఫ్లైఓవర్ను 8th వండర్‌గా చెప్పుకుంటున్నారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్లో నిర్మాణంలో ఉన్న ఈ ప్లైఓవర్ అశోక్ చౌక్ సమీపంలో ఓ ఇంటి బాల్కనీ గుండా వెళ్తున్నట్లు గుర్తించడంతో అందిరి దృష్టిని ఆకర్షించింది. స్థానికులు దీనిని 8th వండర్ అంటున్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI), నాగ్పూర్మున్సిపల్ కార్పొరేషన్ఈ నిర్మాణాన్ని ఒకరి ఇంటిగుండా వెళ్లేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నిస్తున్నారు.
BJP सरकार का मुजस्समा देखिए 👇
— Congress (@INCIndia) September 13, 2025
नागपुर का ये फ्लाईओवर 150 साल पुराने घर की बालकनी से होकर गुजर रहा है।
सवाल है:
• क्या फ्लाईओवर बनाने से पहले ऑडिट नहीं हुआ?
• क्या NHAI ने रास्ते में आ रहे घर को नहीं देखा था?
• किसी हादसे के लिए आखिर कौन जिम्मेदार होगा? pic.twitter.com/8V2iG6P8A5
ఇల్లు అధికారికమైనదేనా.. అలా అయితే పరిహారం ఇచ్చి స్వాధీనం చేసుకోవాలి కదా..అనధికారికంగా ఉంటే ఎందుకు కూల్చలేదని అని అడుగుతున్నారు.
150ఏళ్ల నాటిది ఆ ఇల్లు..
ఆ ఇల్లు..150 ఏళ్ల క్రితం నాటిదట.. ఆ ఇంటి యజమాని చెప్పినదాని ప్రకారం.. ఆరు తరాలుగా వారి కుటుంబం ఆ ఇంట్లో నివసిస్తోంది. ఇంటిని 25 సంవత్సరాల క్రితం పునరుద్ధరించారు.
ఫ్లైఓవర్ నిర్మాణంలో తమ బాల్కనీని కూల్చేసినా ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే బాల్కనీకి అధికారిక పర్మిషన్ ఉందా,ఇంటి ప్లాన్ ఆమోదించారా అని అడిగినప్పుడు వారు తప్పించుకునే సమాధానాలను ఇచ్చారు.
రూ. 998 కోట్ల మోసమా?
స్థానిక మీడియా ప్రకారం.. 9.2 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్‌ను NHAI ఆధ్వర్యంలో రూ.998 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ విషయం గురించి తాము ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్‌కు తెలియజేశామని అధికారులు చెబుతున్నారు. అనధికార నిర్మాణాన్ని కూల్చివేయడం నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత..కానీ అక్కడి అధికారులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.ఇందులో భారీ కుంభకోణం జరిగి ఉండొచ్చని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.