IND vs AUS: డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాతోనే ఢీ.. ఇండియా ఏ జట్టులో ఎంపిక కాని కోహ్లీ, రోహిత్‌

IND vs AUS: డైరెక్ట్‌గా ఆస్ట్రేలియాతోనే ఢీ.. ఇండియా ఏ జట్టులో ఎంపిక కాని కోహ్లీ, రోహిత్‌

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ కు మరికొంత కాలం ఎదురు చూడక తప్పేలా  లేదు. సెప్టెంబర్ 30 నుంచి కాన్పూర్‌లో ఆస్ట్రేలియా ఏ తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కు బీసీసీఐ ఆదివారం (సెప్టెంబర్ 14) ఇండియా ఏ జట్లను ప్రకటించింది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఎంపిక చేయలేదు. ఆస్ట్రేలియాకు సిరీస్ కు ముందు రోకో జోడీ ప్రాక్టీస్ గా ఈ సిరీస్ ఆడతారని భావించినప్పటికీ అది జరగలేదు. ఇద్దరు ఆటగాళ్ళు ఫిట్‌గా అందుబాటులో ఉన్నప్పటికీ.. సెలెక్టర్లు ఇండియా ఏ మ్యాచ్‌లను బలవంతంగా ఆడించకూడదని సెలక్టర్లు నిర్ణయించుకున్నారు.   

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఇక ఆస్ట్రేలియతో జరగబోయే వన్డే సిరీస్ లోనే ఆడనున్నారు. ఫిబ్రవరి లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత  అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. టీ20, టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్.. ఆ తర్వాత టీ20 ఫార్మాట్ లో జరుగుతున్న ఆసియా కప్.. ఇలా వన్డే సిరీస్ ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టులో కనిపించడం ఖాయం. 

ఇక ఇండియా జట్టు విషయానికి వస్తే ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేశారు. తొలి వన్డేలో రజత్ పాటిదార్ ఇండియా ఏ జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. తిలక్ వర్మ రెండు, మూడు మ్యాచ్ లకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. పటిదార్ రెండు, మూడు వన్డేలకు తిలక్ వర్మకు డిప్యూటీగా ఉంటాడు. రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్ వంటి టాలెంటెడ్ డొమెస్టిక్ ప్లేయర్లు ఆస్ట్రేలియా సిరీస్ ముందు తమను తాము నిరూపించుకోవడానికి చక్కని అవకాశం. ఆసియా కప్ స్క్వాడ్ లో ఉన్న కారణంగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా చివరి రెండు మ్యాచ్‌లకు జట్టులో చేరనున్నారు.

సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 మధ్య కాన్పూర్‌ వేదికగా మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, అక్టోబర్ 5 న వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి. మ్యాచ్ లన్నీ కాన్పూర్ లో గ్రీన్ పార్క్ స్టేడియంలో  జరుగుతాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లన్ని మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఆస్ట్రేలియా ఏ తో జరగబోయే వన్డే సిరీస్ కు ఇండియా ఏ స్క్వాడ్: 

తొలి వన్డేకు భారత ఎ జట్టు:

రజత్ పాటిదార్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ సింగ్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంజే పోరెల్

రెండు, మూడు వన్డేలకు ఇండియా ఏ జట్టు:

తిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బదోని, సూర్యాంశ్ షెడ్జ్, విప్రజ్ నిగమ్, నిశాంత్ సింధు, గుర్జప్‌నీత్ సింగ్, అబ్‌డబ్ల్యు.కే. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.