రూట్ తప్పిన పాక్ విమానం..జైపూర్ లో ల్యాండ్

రూట్ తప్పిన పాక్ విమానం..జైపూర్ లో ల్యాండ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్​ గగనతలం నుంచి దూసుకువచ్చిన ఓ విమానం కలకలం రేపింది. అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్​ఫోర్స్ సిబ్బంది విమానాన్ని బలవంతంగా జైపూర్​లో ల్యాండ్​ చేయించారు. అయితే కరాచీ నుంచి ఢిల్లీకి వస్తున్న జార్జియాకు చెందిన ట్రాన్స్ పోర్ట్  విమానం రూట్ తప్పడంతోనే ఈ ఘటనకు కారణమైనట్లు తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కరాచీ నుంచి ఢిల్లీ వైపు వచ్చిన జార్జియాకు చెందిన ఏఎన్​–12 ట్రాన్స్ పోర్ట్ విమానం అంత‌ర్జాతీయ వైమానిక హ‌ద్దుల‌ను ఉల్లంఘించి..జైపూర్ దగ్గరలో ఇండియన్ బార్డర్​లోకి ప్రవేశించింది. గుజరాత్ మీదుగా ఢిల్లీ వైపు దూసుకువచ్చింది. ఇండియన్ ఎయిర్​ఫోర్స్ పైలెట్లు సుఖోయ్–30 ఎంకేఐ ఫైటర్ జెట్స్​తో వెంబడించి జైపూర్​లో ల్యాండ్ చేయించారు. కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చేందుకు ఏటీఎస్ నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పయనించడమే ఈ ఘటనకు కారణమైంది. ఆ విమానం ఉక్రెయిన్​కు చెందిన మోటార్సిచ్ అనే సంస్థకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. విమానంలో ఏముంది.. ఎందుకిలా జరిగిందో తెలుసుకునేందుకు విమాన సిబ్బందిని ప్రత్యేక బృందాలు ప్రశ్నిస్తున్నాయి.