
బెంగళూరు: కర్నాటకలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) శిక్షణ విమానం గురువారం ఉదయం కుప్పకూలింది. ప్రమాద ం జరిగిన సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. విమానం క్రాష్ అవడానికి ముందే పైలట్లు సేఫ్గా బయటపడ్డారని ఎయిర్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు.
‘‘రోజువారీ శిక్షణలో భాగంగా వాయుసేనకు చెందిన సూర్య కిరణ్ ట్రైనర్ విమానం బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. బెంగళూరుకు 136 కి.మీ. దూరంలో చామరాజనగర్ జిల్లా బోగాపుర వద్ద విమానం క్రాష్ అయ్యింది” అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు తేజ్‌పాల్, భూమిక స్వల్పంగా గాయపడ్డారని పేర్కొంది. విమానం క్రాష్ అవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.