టాటాల చేతికి ఎయిర్ ఇండియా.. అఫీషియల్ ప్రాసెస్ పూర్తి

టాటాల చేతికి ఎయిర్ ఇండియా.. అఫీషియల్ ప్రాసెస్ పూర్తి

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా మళ్లీ టాటాల సొంతమైంది. 69 ఏళ్ల తర్వాత ఇవాళ అధికారికంగా టాటాలకు ఎయిర్ ఇండియా సంస్థను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు అఫీషియల్ ప్రాసెస్ పూర్తయింది. ఈ విషయంపై ప్రధాని మోడీని కలసిన అనంతరం టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ స్పందించారు. ఎయిర్ ఇండియాను తిరిగి దక్కించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి ఎయిర్ లైన్ గా మార్చేందుకు అవసరమైన ప్రతి ఒక్కరితో కలసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా, టాటా సంస్థకు ఎయిర్ ఇండియా అప్పగింత పనులు పూర్తయ్యాయని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే తెలిపారు. కంపెనీ షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేశామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

ఫిట్నెస్లో అతడు కుర్రాళ్లకు తీసిపోడు

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్

అఖిలేశ్​ను గెలిపిస్తే మళ్లీ గూండారాజ్‌ తెచ్చుకున్నట్టే