
అహ్మదాబాద్: విమాన ప్రమాదానికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రాణాలు కాపాడుకునేందుకు బీజే మెడికల్ కాలేజీ స్టూడెంట్లు ఐదంతస్తుల బిల్డింగ్ నుంచి ప్రమాదకరంగా కిందికి దిగుతున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
అహ్మదాబాద్లో టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం.. బీజే మెడికల్ కాలేజీ బిల్డింగ్పై కూలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. హాస్టల్లో స్టూడెంట్లంతా లంచ్ చేస్తున్నారు. విమానం కూలిన వెంటనే దట్టమైన పొగ వ్యాపించింది. ఆపై మంటలు ఎగిసిపడ్డాయి.
అందులో ఉన్న స్టూడెంట్లకు బయటికి వెళ్లేందుకు దారి లేదు. ఎగ్జిట్ డోర్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఉండటంతో అందరూ బాల్కనీకి చేరుకున్నారు. బెడ్‌షీట్లు, తాళ్ల సాయంతో కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.