పాపం.. ఎయిర్ ఫోర్ట్‌లో జోక్ వేసి ముంబై వెళ్లకుండా అరెస్టైన ప్యాసింజర్

పాపం.. ఎయిర్ ఫోర్ట్‌లో జోక్ వేసి ముంబై వెళ్లకుండా అరెస్టైన ప్యాసింజర్

విమానాశ్రయంలో చేసిన సరదా అతని చేతులకు సంకెళ్లు వేయించింది. 42ఏళ్ల ఎయిర్ ఇండియా ప్యాసింజర్ పరిస్థితి విచిత్రంగా మారింది. మనోజ్ కుమార్ ఆదివారం కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముంబై వెళ్లాల్సిఉండే. విమానాశ్రయంలోని చెక్‌ఇన్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది లగేజ్ చెక్ చేస్తుండగా.. మనోజ్ నా బ్యాగ్‌లో బాంబ్ ఉందా అని అడిగాడు. 

ఈ ప్రశ్న సెక్యూరిటీ సిబ్బందిలో ఆందోళన కలిగించింది. దీంతో కొచ్చి ఎయిర్ పోర్ట్  CISF సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ ను పిలిపించి పూర్తిగా చెక్ చేయించారు. మనోజ్ ను అరెస్ట్ చేశారు. విచారణ కోసం లోకల్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. నిజానికి మనోజ్ కుమార్ నా బ్యాగ్‌లో బాంబ్ ఉందా అని సరదాగా అన్నాడు.. అది కాస్త ఇష్యూ సీరియస్ అయ్యింది. మనోజ్ కుమార్ జోక్ అతన్ని ముంబై ఫ్లైట్ ఎక్కకుండా చేసి.. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది.