వీడియో : విమానం ఇలా కూలిపోయింది.. కెమెరాలో రికార్డ్ అయిన చివరి క్షణాలు

వీడియో : విమానం ఇలా కూలిపోయింది.. కెమెరాలో రికార్డ్ అయిన చివరి క్షణాలు

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు అతి సమీపంలో.. ఎయిర్ ఇండియాకు చెందిన AI0717 బోయింగ్ విమానం కూలిపోయింది. టాకాఫ్ అయిన జస్ట్ 5 నిమిషాల్లోనే.. సిటీలోని మేఘాని కాలనీపై పడిపోయింది ఫ్లయిట్.. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ బిల్డింగ్ లోని వ్యక్తి.. సెల్ ఫోన్ లో విమాన ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

పైకి వెళ్లాల్సిన విమానం.. అమాంతం కిందకు దిగుతూ కనిపించింది. అత్యంత వేగంగా ల్యాండ్ అవుతూ కనిపించింది వీడియోలో.. జస్ట్ 18 సెకన్లు ఉన్న ఈ వీడియోలో.. విమానం కింద పడుతూ.. పేలిపోవటం కూడా కనిపించింది. విమానం కూలిన తర్వాత పెద్ద శబ్ధంతోపాటు.. మంటలు వచ్చాయి. లండన్ వెళుతున్న విమానం.. ఫుల్ గా ఆయిల్ ఉంది.. దీంతో క్రాష్ అయిన వెంటనే.. మంటలు పెద్ద ఎత్తున లేచాయి.. విమాన ప్రమాదం విజువల్స్ ఇలా ఉన్నాయి..