దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతకు తగ్గట్టుగానే.. డిమాండ్ ఉన్నప్పుడే కోట్లకు కోట్లు కొల్లగొట్టాలన్న ఐడియాతోనే ముందుకెళుతున్నాయి ఇండియాలో ఎయిర్ లైన్స్ కంపెనీలు. ఇండిగో ఫ్లట్స్ వందల సంఖ్యలో రద్దవ్వటంతో మిగతా ఎయిర్ లైన్స్ దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. డిమాండ్ తగ్గట్టుగా.. ఎమర్జన్స్, అర్జంట్ ఆధారంగా వేలు, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి మిగతా ఎయిర్ లైన్స్. ఇండిగో ఫ్లయిట్స్ మూడో రోజు 550 విమాన సర్వీసులు రద్దవ్వటంతో.. మిగతా ఎయిర్ లైన్స్ టికెట్ రేట్లను అమాంతం పెంచేశాయి.
ఆర్థిక రాజధాని ముంబై టూ దేశ రాజధాని ఢిల్లీకి 40 వేల రూపాయలు పలుకుతుంది. రెగ్యులర్ రోజుల్లో ఈ టికెట్ ధర 13 వేల రూపాయలు మాత్రమే. ఇప్పుడు ట్రిపుల్ అయ్యింది. ముంబై టూ ఢిల్లీ కిలోమీటర్లు 14 వందలు.. జర్నీ టైం 2 గంటలు.. ముంబై టూ ఢిల్లీకి మాములుగానే అయితే ఇండిగో విమాన సర్వీసులు 20 నుంచి 25 వరకు ఉంటాయంట.. ఇప్పుడు ఆ ఫ్లయిట్స్ అన్నీ క్యాన్సిల్ కావటంతో.. మిగతా ఎయిర్ లైన్స్ విపరీతమైన డిమాండ్ వచ్చింది. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు అర్జంట్.. ఎమర్జన్సీగా వెళ్లాలి అనుకుంటే 40 వేల రూపాయలు పెట్టి టికెట్ కొని వెళుతున్నారు.
ఇక గోవా టూ ముంబై కూడా ఇదే పరిస్థితి ఉందంట. కోల్ కతా లో ఓ షోకు వెళ్తోన్న బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఫ్లైట్ల ఆలస్యం వల్ల తాను షోను కోల్పోయే అవకాశం ఉందని చెప్పాడు. తన జీవితంలో అత్యంత చెత్త రోజని వీడియో పోస్ట్ చేశాడు. గోవా నుంచి ముంబై వెళ్లడానికి నాలుగు లక్షల 20 వేలు చార్జీలు చేశానని చెప్పాడు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇబ్బందులు
ఇండిగో విమానాల ఆలస్యం రద్దుతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి శబరి వెళ్లే అయ్యప్ప భక్తులకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్యాసింజర్లు ఎదురుచూస్తున్నారు. విమానాల ఆలస్యానికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వడంలో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది జాప్యం చేస్తున్నారు .దీంతో గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేక ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు..
సోషల్ మీడియాలో ట్యాగింగ్
విమానాల రద్దులు, ఆలస్యాలపై ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు కొందరు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగో మేనేజ్మెంట్ను పిలిపించి వివరణ కోరింది. 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించింది.
